అన్నం వండేటపుడు గంజి వార్చి తాగితే పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. జీర్ణశక్తి బాగుంటుంది. అలాగే లూజ్ మోషన్స్ సమస్య తొందరగా తగ్గుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది.
పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి లూజ్ మోషన్స్ సమస్య నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి.
దానిమ్మ రసంలో టానిన్స్ ఉంటాయి. ఇవి లూజ్ మోషన్స్ కంట్రోల్ చేసేందుకు సహాయపడతాయి. దీనికోసం లూజ్ మోషన్స్ ఉన్నపుడు ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిదని ROJPHM రిపోర్ట్ పేర్కొంది.
జీలకర్ర నీళ్లు తాగడం ద్వారా లూజ్ మోషన్స్ సమస్య నుంచి తొందరగా బయటపడొచ్చు. దీనికోసం నీళ్లలో జీలకర్ర వేసి బాగా మరిగించి తాగితే పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. విరేచనాలు తగ్గుతాయి.
అల్లం టీలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు పేగుల్లో మంట, వాపు తగ్గిస్తాయి. మలవిసర్జనకు వెళ్లాలనే ఆలోచన రాకుండా కాపాడుతాయి. దీంతో లూజ్ మోషన్స్ సమస్య తగ్గించుకోవచ్చు.
మెంతులను నీళ్లలో నానబెట్టి తాగడం ద్వారా పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. లూజ్ మోషన్స్ సమస్య నుంచి త్వరితగతిన ఉపశమనం కలుగుతుంది.
అరటి పండ్లలో పెక్టిన్ అనే ఫైబర్‌తో పాటు పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి పేగుల్లోని అదనపు నీటిని శోషించుకుని మలం ఏర్పడకుండా చూస్తాయి. తద్వారా లూజ్ మోషన్స్ నుంచి ఉపశమనం కల్పిస్తాయి.
మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ మజ్జిగలో కొద్దిగా రాళ్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి వేసి తాగితే మీ బాడీకి కావాల్సిన ఎనర్జీ అందుతుంది. అలాగే లూజ్ మోషన్స్ తగ్గుతాయి.
లూజ్ మోషన్స్ వల్ల శరీరం తొందరగా లవణాలను కోల్పోతుంది. దీంతో నీరసంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొబ్బరి నీళ్లు లేదా ఓఆర్ఎస్ తాగడం చాలా అవసరం. ఇవి బాడీలోని సోడియం, పొటాషియం వంటి లవణాలను సమతుల్యం చేసి మీకు ఎనర్జీని అందిస్తాయి.