
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు గల అవకాశాలు’ అనే ప్రత్యేక సదస్సులో పాల్గొనేందుకు ఆయన అక్కడకు వెళ్లారు.
ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ తన సొంత నియోజకవర్గమైన మంగళగిరికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ చేనేత శాలువాతో బెంగాల్ సీఎంను ఘనంగా సత్కరించారు.
ఇరు రాష్ట్రాల ముఖ్య నేతల మధ్య జరిగిన ఈ భేటీ ప్రస్తుత రాజకీయ మరియు పారిశ్రామిక వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. Read Also : ఆధునిక రాజకీయంలో ‘ప్రసవ’ ప్రహసనం ఈ ఉమ్మడి సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రగతి, పరిపాలనా విధానాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (Speed of Doing Business) విధానాన్ని, పారిశ్రామిక వేత్తలకు కల్పిస్తున్న రాయితీలను, వేగవంతమైన అనుమతుల ప్రక్రియను బెంగాల్ సీఎంకు లోకేష్ సుదీర్ఘంగా వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బెంగాల్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరారు.
అదే సమయంలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమలవుతున్న వివిధ ప్రజా సంక్షేమ పథకాలు, వాటి నిర్వహణ తీరును మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక బంధాన్ని బలోపేతం చేయడంతో పాటు పరస్పర సహకారానికి ఈ భేటీ ఒక మంచి వేదికగా నిలిచింది.
Africa : ఎయిర్పోర్టుపై అల్ ఖైదా అటాక్.. 13 మంది మృతి గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Saikrishna Missing Case : సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం Nara
Lokesh: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన మంత్రి లోకేశ్
AP Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో కారుమూరి సునీల్ కుమార్కు 14 రోజుల రిమాండ్
10th Class Supplementary Results : కాసేపట్లో ఏపీ టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్
Nellimarla Alliance Issue: నెల్లిమర్లలో వికటించిన పొత్తు ధర్మం!
Collector Prabhakar Reddy: సర్కారు బడిలో కలెక్టర్ కొడుకు!