
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారడం, చమురు ధరలు పడిపోవడం వంటి పరిణామాలతో ఈ లోహాలకు డిమాండ్ తగ్గింది. దీంతో వీటి ధరలు (Gold, Silver Rate) తగ్గుముఖం పట్టాయి.
హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పుత్తడి (Gold) ధర రూ.1,49,270గా ఉంది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు రూ.3000కు పైనే తగ్గింది. ఇక, కేజీ వెండి ధర రూ.2.37లక్షలు పలికింది. వెండి ధర ఒక్క రోజే రూ.8,600 తగ్గడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు దిగొచ్చాయి. ఔన్సు పుత్తడి ధర 4,139 డాలర్లు, ఔన్సు వెండి (Silver) ధర 63.85 డాలర్లుగా ఉంది. కమొడిటీ ఎక్స్ఛేంజీ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ. 1.46 లక్షలకు పడిపోయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ధర రూ.2.30లక్షలుగా కొనసాగుతోంది.
అమెరికా-ఇరాన్ యుద్ధం ముగియడం, ఫెడ్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు కోలుకున్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే మన కరెన్సీ రూపాయి విలువ కూడా బలపడుతోంది. చమురు ధరలు యుద్ధం మునుపటి స్థితికి దిగొస్తున్నాయి. ఈ కారణాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు.
అటు దేశీయంగానూ కొనుగోళ్లు తగ్గడం కూడా వీటి ధరల పతనానికి కారణమవుతున్నట్లు పేర్కొంటున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.