
Indus Water : సింధూ నదీ జలాల పంపిణీ విషయంలో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారానికి ఐక్యరాజ్యసమితి (UN) సాక్షిగా భారతదేశం అత్యంత ఘాటుగా సమాధానమిచ్చింది. జెనీవాలో జరుగుతున్న యూఎన్హెచ్ఆర్సీ (UNHRC) 62వ సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి అనుపమ సింగ్ ఈ ఉదంతంపై దేశ వైఖరిని స్పష్టం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందానికి (Indus Water Treaty) పూర్తిగా కాలం చెల్లిందని, ఆనాటి నిబంధనలు నేటి మారుతున్న భౌగోళిక, పర్యావరణ పరిస్థితులకు ఏమాత్రం సరిపోవని ఆమె తేల్చి చెప్పారు. దశాబ్దాల క్రితంనాటి పాత చట్టాలను పట్టుకుని వేలాడటం వదిలేసి, ప్రస్తుత వాస్తవ పరిస్థితులను గ్రహించాలని పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ప్రతినిధుల ముందే గట్టిగా చురకలంటించారు.
Read Also : ఇండియా లో తీవ్ర కరవు ఏర్పడబోతుందా..? ఆందోళన కలిగిస్తున్న IMD నిపుణుల హెచ్చరిక పాకిస్తాన్ ప్రభుత్వం ఒకవైపు భారత్‌పైకి సరిహద్దుల గుండా ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రోత్సహిస్తూ, మరోవైపు అంతర్జాతీయ ఒప్పందాల పేరిట భారత్ నుండి స్నేహాన్ని, సద్భావనను ఆశించడం ముమ్మాటికీ అసాధ్యమని అనుపమ సింగ్ స్పష్టం చేశారు.
“రక్తపాతం, ఉగ్రవాద చర్యలకు పాల్పడే ఏ దేశమైనా పొరుగు దేశం నుండి సద్భావన వల్ల కలిగే ప్రయోజనాలను ఆశించలేదు” అంటూ భారత్ తరఫున ఒక బలమైన సందేశాన్ని పాక్‌కు పంపారు. కశ్మీర్ అంశాన్ని లేదా జలాల వివాదాన్ని అనవసరంగా అంతర్జాతీయ వేదికలపైకి తెచ్చి నాటకాలు ఆడటం మానేసి, మొదట పాకిస్తాన్ తన దేశంలో ఉన్న అంతర్గత సంక్షోభాలు మరియు సొంత వ్యవహారాలను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు.
ఉగ్రవాదాన్ని వీడనంత కాలం భారత్ నుండి ఎటువంటి రాయితీలు ఉండబోవనే సంకేతాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా భారత్ మరోసారి ప్రపంచానికి స్పష్టం చేసింది. Telangana Rain Update: మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార
ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Nara Lokesh: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన మంత్రి లోకేశ్
Samajwadi Party – BJP : సమాజ్‌వాదీ పార్టీతో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందా ?
DMK సపోర్ట్ కోసం పవన్ కళ్యాణ్ ను NDA దింపబోతుందా ?
Severe Drought India : ఇండియా లో తీవ్ర కరవు ఏర్పడబోతుందా..? ఆందోళన కలిగిస్తున్న IMD నిపుణుల హెచ్చరిక
UPIతో పీఎఫ్ విత్ డ్రా.. ఎప్పటి నుండి అంటే !!
Neet Student Suicide : మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. !!