
Spirit Update : టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, గ్లోబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ మూవీ ‘స్పిరిట్’ (Spirit) గురించి ఒక క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో కథా గమనానికి ప్రాధాన్యత ఎక్కువ ఉండి, రెగ్యులర్ కమర్షియల్ హంగులు కాస్త తక్కువగా ఉంటాయి.
కానీ, ఈసారి ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టుగా, ఆయన అభిమానులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడం కోసం సందీప్ తన రూట్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ప్రభాస్ కోసం ఒక నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ సీన్‌తో పాటు, థియేటర్లు దద్దరిల్లిపోయేలా ఒక అదిరిపోయే ఇంట్రో సాంగ్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారట.
ఈ మాస్ ఇంట్రడక్షన్ బ్లాక్ ప్రభాస్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్‌గా నిలిచిపోతుందని టాలీవుడ్ వర్గాలు గట్టిగా చెప్పుకుంటున్నాయి. Read Also : ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ ‘థాంక్యూ సుబ్బారావు’ కమర్షియల్ ఎలివేషన్లు ఉన్నప్పటికీ, ఈ సినిమా కోర్ పాయింట్ మాత్రం సందీప్ రెడ్డి వంగా మార్క్ రా అండ్ రస్టిక్ ఇంటెన్సిటీతోనే సాగనుందని సమాచారం.
ఈ చిత్రంలో ఉండే ఎమోషన్, డార్క్ అండ్ గ్రిప్పింగ్ కంటెంట్ అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులను, ముఖ్యంగా కొరియన్ సినిమా లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు గట్టి నమ్మకంతో ఉన్నారట. కొరియన్ క్రైమ్ థ్రిల్లర్లలో ఉండే విలక్షణమైన స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ డ్రైవ్ తరహాలోనే ‘స్పిరిట్’ కథనం కూడా చాలా ఇంటెన్సివ్‌గా ఉండబోతోంది.
సార్వత్రిక అప్పీల్ ఉన్న కథ కావడంతోనే ఈ చిత్రాన్ని కేవలం పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా, అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్-వరల్డ్ స్థాయిలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. Telangana Rain Update: మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన గమనిక: ఈ వెబ్ సైట్
లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Maa Inti Bangaram Talk : మా ఇంటి బంగారం – అదరగొట్టిన సమంత ..కాకపోతే !!
KathaSudha : జూన్ 21 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు సిద్దమైన ‘కథాసుధ – సండే స్టోరీస్’
Peddi 14 days collection: 320 కోట్లు దాటేసిన ‘పెద్ది’.. 14వ రోజు కలెక్షన్ల లెక్కలివే!
Samantha Visits Tirumala: ‘మా ఇంటి బంగారం’ టీమ్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత
Venkatesh Kalyan Ram Multistarrer: అల్లు అరవింద్ క్లాప్‌తో..వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీ ప్రారంభం!!
Samantha Meets CM Vijay : సీఎం విజయ్ ని కలిసిన సమంత