
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం అంతర్జాతీయంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్ ప్రభుత్వ వైఖరిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ పట్ల సానుభూతితో ఉన్న ఏకైక దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ మాత్రమేనని, అలాంటి శక్తిమంతమైన మిత్రుడిని విమర్శించడం ఇజ్రాయెల్‌కు మంచిది కాదని హెచ్చరించారు.
అంతర్జాతీయంగా తాము ఎదుర్కొంటున్న ఒంటరితనాన్ని, భౌగోళిక రాజకీయ వాస్తవాలను ఇజ్రాయెల్ పాలకులు ఇప్పటికైనా గ్రహించాలని ఆయన హితవు పలికారు.హర్మూజ్ దిగ్బంధనాన్ని తొలగించడం, జలసంధిని వాణిజ్య రవాణాకు తిరిగి తెరవడం వంటి కీలక అంశాలతో కూడిన ఈ 14 సూత్రాల అవగాహన ఒప్పందాన్ని వైట్ హౌస్ పూర్తిగా సమర్థించుకుంది. ఇజ్రాయెల్ రక్షణకు అవసరమైన మూడింట రెండు వంతుల ఆయుధాలను అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ముతోనే సమకూరుస్తున్న విషయాన్ని వాన్స్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కేవలం దాడులు, హింస ద్వారానే అన్ని భద్రతా సమస్యల నుంచి బయటపడలేరని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు కార్యకలాపాలను అదుపు చేయడానికి ఈ 60 రోజుల చర్చల సమయం ఎంతో కీలకమని, దీనిపై ఇజ్రాయెల్ క్యాబినెట్ అనవసరంగా ఆందోళన చెందుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.మరోవైపు, ఇరాన్‌కు ఆర్థిక ఉపశమనం కలిగించే ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు క్యాబినెట్‌లోని మితవాద మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఒప్పందం వల్ల లెబనాన్‌లోని హిజ్బుల్లా, ఇరాన్ అణు ఆకాంక్షలను అడ్డుకోవడం సాధ్యం కాదని వాదిస్తున్నారు. అమెరికాతో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్న మాట