
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Telangana Rythu Bharosa First Priority To These Farmers: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'రైతు భరోసా' పథకం నిధులు ఈ జూన్ 30న విడుదల కానున్నాయి. ఈ పథకం ద్వారా రైతులకు నేరుగా నగదు బదిలీ (DBT) పద్ధతిలో నిధులు అందుతాయి. గతంలో ఈ నిధులను జూన్ 26న విడుదల చేస్తామని చెప్పి, ఆపై ఆ తేదీని జూన్ 30కి మార్చారు. నిధుల విడుదల ప్రక్రియలో భాగంగా మొదట ఒక ఎకరం భూమి ఉన్న వారికి, ఆ తర్వాత రెండు, ఐదు ఎకరాల రైతులకు నగదు జమ చేస్తారు. మిగిలిన రైతులకు నిధుల సర్దుబాటు ప్రకారం త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 9 రోజులపాటు కొనసాగుతుంది. దీనికి రూ.9 వేల కోట్లు రెడీ చేయాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశించారు. మధిర సమావేశంలో ఈ నిధులు విడుదల అవుతాయి.
రైతు భరోసా పథకం ద్వారా లభించే ఆర్థిక సాయం ఎంత? రైతు భరోసా పథకం కింద తెలంగాణ రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్పున అందుతాయి. అర్హత ఉన్న రైతులకు రబీ, ఖరీఫ్ సీజన్లను కలిపి ఏడాదికి మొత్తం రూ.12,000 లభిస్తాయి. అంటే ఒక్కో సీజన్‌కు రూ.6,000 చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ నగదు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతోంది.
రైతు భరోసా అర్హతలు ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం సాగు భూమి కలిగిన రైతులకు మాత్రమే వర్తిస్తుంది. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా భూమిని తనిఖీ చేసి, వ్యవసాయానికి వాడుతున్న భూమి ఉందో లేదో నిర్ధారిస్తారు. ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న చిన్న, పెద్ద భూస్వాములు అందరూ ఈ పథకానికి అర్హులు. అయితే, ఈ నిధులు నేరుగా మీ ఖాతాలోకి రావాలంటే బ్యాంకులో ఆధార్ సీడింగ్ కచ్చితంగా ఉండాలి.
ఖరీఫ్ సీజన్ నిధుల విడుదల వివరాలు.. జూన్ 30న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను అధికారికంగా విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ సుమారు 10 రోజుల పాటు కొనసాగుతుంది, తద్వారా లక్షలాది మంది రైతులు లబ్ధి పొందుతారు.
చెల్లింపులను ఎలా తెలుసుకోవాలి? తమ ఖాతాలో నిధులు జమ అయ్యాయా? లేదా? అనేది రైతులు మొబైల్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పది రోజుల పాటు జరుగుతుంది కాబట్టి, నిధుల కోసం వేచి చూడాలి. ఒకవేళ డబ్బులు జమ కాకపోతే, స్థానిక వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. రైతు భరోసాకు సంబంధించి హెల్ప్ లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పది రోజుల తర్వాత కూడా నగదు జమ కాకపోతే, 180042550 అనే ప్రత్యేక రైతుబంధు హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి మీ సమస్యను తెలియజేయవచ్చు. అంతేకాకుండా, అధికారిక వెబ్సైట్ లో ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉపయోగించి లాగిన్ అయ్యి కూడా చెల్లింపుల వివరాలను తెలుసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.