
• 2024లో RINL ఆర్థికసాయం నిలిపివేతతో మూతబడిన స్కూలు • విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోకి పాఠశాల • వందలాది విద్యార్థుల ప్రవేశాలతో కళకళలాడుతోన్న విశాఖ విమల విద్యాలయం • విశాఖ వ్యాలీ స్కూలు మోడల్లో నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం నలభై ఏళ్లుగా విద్యల వెలుగుదివ్వెగా నిలిచిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ ఉక్కునగరం, సెక్టార్-6లో ఉన్న విశాఖ విమల విద్యాలయంపై ఆర్థిక ఇబ్బందుల చీకట్లు కమ్ముకున్నాయి. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ఆర్థిక సహాయాన్ని అకస్మాత్తుగా నిలిపివేయడంతో, జూన్ 2024లో బడి మూతబడింది.
గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రతిష్టాత్మక విశాఖ విమల విద్యాలయంను ఎలాగైనా పునఃప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యాలయం ఆరంభం అయ్యేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు మంత్రి లోకేష్ జారీ చేశారు.
ఇది ఒక పాఠశాల సమస్యగా చూడకుండా, దశాబ్దాలుగా ఓ వెలుగు వెలిగిన ప్రతిష్టాత్మక విద్యాలయంని కొనసాగించే కృతనిశ్చయంతో పనిచేశారు. మంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో, వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంగా పనిచేయడంతో విశాఖ విమల విద్యాలయం పునఃప్రారంభం అయ్యింది.
ప్రభుత్వమే పాఠశాల నిర్వహణ బాధ్యతలను తీసుకుంది. విశాఖ వ్యాలీ స్కూల్ మోడల్లోనే కలెక్టర్ ఛైర్మన్గా విశాఖ విమల విద్యాలయంను నిర్వహించి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు.
స్టీల్ ప్లాంటునూ పరిరక్షించారు.. అందులో పాఠశాలనూ పునఃప్రారంభించారు.. విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా కేంద్రంతో మాట్లాడి రూ.12 వేల కోట్లు ప్యాకేజీ సాధించిన కూటమి ప్రభుత్వం కృషిలో మంత్రి నారా లోకేష్ కీలకపాత్ర పోషించారు.
విద్యాలయంను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మళ్లీ ప్రారంభించారు. యూకేజీ వరకూ 55, 1 నుండి 10 వ తరగతి వరకూ 723 విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం కోసం వి.వి.విలో జాయినయ్యారు. పునఃప్రారంభం రోజునే వందలాది మంది పిల్లలు చేరడం విశాఖ విమల విద్యాలయం ప్రతిష్టను చాటిచెబుతోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో పాఠశాలలో నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంను కూడా ఆరంభించారు. విశాఖ విమల విద్యాలయం చరిత్ర రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు 1984లో ఆర్ సీఎం డయాసిస్ వారితో ఒప్పందం చేసుకుని విశాఖ విమల విద్యాలయంను ప్రారంభించారు. ఫ్రీ ఎడ్యుకేషన్ లక్ష్యంగా ప్రాజెక్టు స్కూలుగా దశాబ్దాలుగా నడిచింది. మొదట్లో కేవలం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లలకే స్కూలులో ప్రవేశాలు కల్పించేవారు. రాను రాను ఉద్యోగుల పిల్లలు తగ్గిపోవడంతో RINL కాంట్రాక్టు ఉద్యోగుల పిల్లలు, నిర్వాసితుల పిల్లలకు ఇక్కడ సీట్లు ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఉక్కునగరం పరిధిలో 36 కాలనీల పిల్లలను కూడా బడిలో చేర్చుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల పిల్లలు, పునరావాస కాలనీలు, నిరుపేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో విశాఖ విమల విద్యాలయం పాత్ర గణనీయమైనది. RINL ఆర్థిక సహాయాన్ని అకస్మాత్తుగా నిలిపివేయడంతో, జూన్ 2024లో విశాఖ విమల విద్యాలయంను ఆర్ సీఎం డయాసిస్ మూసివేసింది. మూసివేసే నాటికి సుమారు 2,200 మంది విద్యార్థులు, 100 మంది బోధన, బోధనేతర ఉద్యోగులు పనిచేసేవారు. నేరుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని ఈ విద్యాలయం పున:ప్రారంభం చేయడంతో వేలాది మంది విద్యార్థులకు వెలుగుబాట అయ్యింది. ప్రశ్నార్థకమైన టీచర్లు, సిబ్బంది భవితవ్యానికి ఒక భరోసా దొరికింది.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పనిచేసినట్టే, మూతబడిన విశాఖ విమల విద్యాలయంను తెరిపించేందుకు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విశేష కృషి చేశారు. జూన్ 12న విశాఖ విమల