
Kaudipalli Dhaba Liquor Checks | మెదక్ జిల్లా, కౌడిపల్లి, జూన్ 19: ప్రభుత్వ అనుమతులు లేకుండా దాబాల్లో మద్యం సరఫరా చేసినా, మద్యం సేవించేందుకు అవకాశం కల్పించినా కఠిన చర్యలు తప్పవని కౌడిపల్లి ఎస్సై అమరేందర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని కౌడిపల్లి, ధర్మసాగర్, వెంకటరావుపేట గేట్, తునికి గేట్ ప్రాంతాల్లో 765డీ జాతీయ రహదారి పక్కన కొనసాగుతున్న దాబాలపై ఎస్సై అమరేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Read also: Telangana Road Accident: తెలంగాణలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు..కేంద్ర నివేదిక వెల్లడి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న దాబాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. దాబాల్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ మద్యం సరఫరా చేయరాదని, మద్యం సేవించే వారికి ఆసరా కల్పించకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఒకవేళ దాబాల్లో మద్యం విక్రయించడం లేదా మద్యం సేవించేందుకు అనుమతించడం జరిగినట్లయితే సంబంధిత దాబాను సీజ్ చేసి యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు. జాతీయ రహదారులపై మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు, దాబా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ తనిఖీల్లో ఎస్సై అమరేందర్ రెడ్డితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Nellimarla Alliance Issue: నెల్లిమర్లలో వికటించిన పొత్తు ధర్మం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను కొండగట్టు అంజన్న తో పోల్చిన నిరంజన్ తండ్రి Kavitha: నేను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను బీజేపీలో
విలీనం చేయాలనే ప్రయత్నం జరిగింది: కవిత
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలంటూ కవిత డిమాండ్
Telangana Road Accident: తెలంగాణలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు..కేంద్ర నివేదిక వెల్లడి
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం గుడ్ న్యూస్