చాలామంది డిటర్జెంట్ పౌడర్, లిక్విడ్ ఎక్కువగా వాడితే ఆరిన తర్వాత దుర్వాసన రాదు అనే అపోహలో ఉంటారు. డిటర్జెంట్ ఎక్కువగా ఉంటే దుస్తులపై అవశేషాలు మిగిలిపోతాయి. ఇవి దుస్తులపై తేమను బంధిస్తాయి.
దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి సరిపడే వాతావరణాన్ని సృష్టిస్తాయి. మీరు సాధారణంగా వాడే డిటర్జెంట్ పరిమాణంలో సగం వాడండి. వాషింగ్ మెషిన్ రిన్స్ సైకిల్లో ఒక మూత వైట్ వెనిగర్ వేయండి. ఇది మీ దుస్తులలోని బ్యాక్టీరియాను చంపి, సహజంగా దుర్వాసను తొలగిస్తుంది.
దుస్తులు ఆరబెట్టేప్పుడు ఒకదానిపై ఒకటి కాకుండా కొంచెం దూరంగా ఆరేయండి. దీంతో వాటికి సరైన వెంటిలేషన్ అందుతుంది. దీంతో దుస్తులు వేగంగా ఆరిపోతాయి. ఒకే వరుసలో, అన్ని దుస్తులు ఆరేయడానికి బదులుగా సెపరేట్ హ్యాంగర్లను వాడటం వల్ల కూడా దుస్తులు త్వరగా ఆరడానికి ఉంటుంది.
దుస్తులు త్వరగా ఆరాలంటే వాటిలోని ఎక్స్ట్రా నీరును గట్టిగా పిండేయండి. ఒకవేళ మీరు వాషింగ్ మెషీన్ వాడుతుంటే, దుస్తులు ఉతికిన తర్వాత ఎక్స్ ట్రా స్పిన్ సైకిల్ రన్ చేయండి. దీనివల్ల దుస్తుల్లోని 90 శాతం నీరు పోతాయి. దీంతో దుస్తులు త్వరగా ఆరతాయి.
వర్షాకాలంలో దుస్తులను త్వరగా ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్లను వాడండి. ముఖ్యంగా కాలర్లు, స్లీవ్‌లు, మందపాటి దుస్తులను తర్వగా ఆరబెట్టడానికి సహాయపడుతుంది. హెయిర్ డ్రయర్లలోని వేడి గాలి దుస్తులను త్వరగా ఆరబెడుతుంది.
ఒకవేళ మీ దుస్తులు 90% ఆరిపోతే, మిగిలిన తేమను తొలగించడానికి ఐరన్ బాక్స్ వాడండి. మీ దుస్తులను ఐరన్ చేస్తే దానిలో మిగిలిన తేమ, దుర్వాసన కలిగించే క్రిములను నాశనం చేస్తాయి. పిల్లల యూనిఫాం, ఆఫీస్ దుస్తులు, ఫార్మల్ దుస్తులకు ఈ చిట్కా ఎంతో సహాయపడుతుంది.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది కూడా పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి