
విశాఖపట్నం ఉక్కునగరంలో నాలుగు దశాబ్దాలుగా విద్యా వెలుగులు పంచుతున్న విశాఖ విమల విద్యాలయం మళ్లీ విద్యార్థులతో కళకళలాడుతోంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ఆర్థిక సహాయం నిలిపివేయడంతో గత జూన్ నెలలో మూతపడిన ఈ పాఠశాల, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో పునఃప్రారంభమైంది.
రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా పాఠశాల నిర్వహణ బాధ్యతలను స్వీకరించడంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లభించింది.ప్రభుత్వ ఆధ్వర్యంలోకి పాఠశాలవిశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లోని విమల విద్యాలయం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూతపడటంపై స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని ఆయన నేరుగా మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లి, పాఠశాలను ఎలాగైనా తెరిపించాలని కోరారు.
తక్షణమే స్పందించిన మంత్రి లోకేశ్, దీన్ని కేవలం ఒక పాఠశాల సమస్యగా కాకుండా, ఒక చారిత్రక విద్యాసంస్థను కాపాడే బాధ్యతగా తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయడంతో పాఠశాల పునఃప్రారంభానికి మార్గం సుగమమైంది. విశాఖ వ్యాలీ స్కూల్ నమూనాలో జిల్లా కలెక్టర్ ఛైర్మన్గా ఈ విద్యాలయాన్ని నడిపి, పూర్వ వైభవం తీసుకురావాలని మంత్రి లోకేశ్ దిశానిర్దేశం చేశారు.రికార్డు స్థాయిలో ప్రవేశాలుమంత్రి ఆదేశాల మేరకు జూన్ 12న విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాఠశాలను లాంఛనంగా పునఃప్రారంభించారు.
ప్రారంభించిన వెంటనే పాఠశాలలో ప్రవేశాలు వెల్లువెత్తాయి
.