
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్లైన్ సేవలు ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు...
Jun 18 2026 9:30 PM | Updated on Jun 18 2026 9:30 PM
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్లైన్ సేవలు ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ విరామం అవసరమని ఆయన పేర్కొన్నారు.
సుమారు ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఈ సర్వర్ నిర్వహణ పనుల ద్వారా సర్వర్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేయడం, భద్రతా ప్రమాణాలు బలోపేతం కావడం, సేవల నాణ్యత మెరుగుపడడం లక్ష్యమని ఐజీ వివరించారు.
ప్రజలకు అసౌకర్యం తగ్గించేలా షెడ్యూల్ జూన్ 26న మొహరమ్, జూన్ 28న ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో, మధ్యలో ఉన్న జూన్ 27న ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ పని దినంలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతుందని గురువారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. దీంతో సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం అత్యల్పంగా ఉండేలా ఈ షెడ్యూల్ రూపొందించామని తెలిపారు.
సేవలు పునఃప్రారంభం ప్రజలు తమ రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని, జూన్ 29వ తేదీ నుంచి అన్ని సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. శాఖ నిర్వహణ పనులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)
పూరీ జగన్నాథ్ కూతురి లేటెస్ట్ లుక్ (ఫొటోలు)
అనార్కలి.. చీర.. కుర్తా.. ఏదైనా సరే మృణాల్ తర్వాతే (ఫొటోలు)
వదిలిపెట్టను..! ఫోటోకు దండే...!? CIకి జగన్ మాస్ వార్నింగ్
హౌస్ వైఫ్ అని చులకనగా చూసారు, 70 AI టూల్స్ నేర్చుకున్నా
ఎవడి అండతో రెచ్చిపోతున్నారు? చంద్రబాబుపై జగన్ ఫైర్
ప్రత్యక్ష సాక్షి వీడియోను జగన్‌కు చూపించిన సాయి కృష్ణ తల్లి