
'సలార్' సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. ప్రస్తుతం మహేశ్-రాజమౌళి 'వారణాసి'లో విలన్‌గా చేస్తున్నాడు.
Jun 18 2026 7:56 PM | Updated on Jun 18 2026 8:05 PM
'సలార్' సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. ప్రస్తుతం మహేశ్-రాజమౌళి 'వారణాసి'లో విలన్‌గా చేస్తున్నాడు. ఇతడి పాత్రకు సంబంధించిన షూటింగ్ చాన్నాళ్ల క్రితమే పూర్తయింది. అదొచ్చేలోపు పృథ్వీరాజ్ హీరోగా చేసిన ఓ మూవీ విడుదలకు సిద్ధమైంది. 'ఐ, నోబడీ' పేరుతో దీన్ని తీయగా.. వచ్చే నెల 9న తెలుగు, తమిళ, మలయాళంలో రిలీజ్ చేయనున్నారు.
(ఇదీ చదవండి: హీరోగా మెగా డైరెక్టర్ కొడుకు.. కూతురు ఇప్పటికే హీరోయిన్)
ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు. ట్రైలర్ బట్టి చూస్తే ఇది డబ్బు చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్. ప్రభుత్వ ఉద్యోగం చేసే రాజీవ్(పృథ్వీరాజ్) ఓ డబ్బు వివాదంలో ఇరుక్కుంటాడు. దీంతో విలన్, పోలీసులు నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? దీనికోసం అంతమంది ఎందుకు వెతుకున్నారు? ఇంతకీ రాజీవ్ ఎవరు? అనేది స్టోరీలా అనిపిస్తుంది. పార్వతి తిరువత్తు హీరోయిన్. నిషాం బషీర్ డైరెక్టర్. పృథ్వీరాజ్ భార్య సుప్రియ ఓ నిర్మాత. ట్రైలర్ చివరలో 'మీ నాన్నతో ఫైట్ చేసిన వాళ్లెవరూ ఇప్పుడు ప్రాణాలతో లేరు' అనే డైలాగ్ మూవీపై ఆసక్తి కలిగిస్తోంది.
(ఇదీ చదవండి: 'పుష్ప' కాన్సెప్ట్‌తో ధనుష్ సినిమా.. టీజర్ రిలీజ్)
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)
పూరీ జగన్నాథ్ కూతురి లేటెస్ట్ లుక్ (ఫొటోలు)
అనార్కలి.. చీర.. కుర్తా.. ఏదైనా సరే మృణాల్ తర్వాతే (ఫొటోలు)
వదిలిపెట్టను..! ఫోటోకు దండే...!? CIకి జగన్ మాస్ వార్నింగ్
హౌస్ వైఫ్ అని చులకనగా చూసారు, 70 AI టూల్స్ నేర్చుకున్నా
ఎవడి అండతో రెచ్చిపోతున్నారు? చంద్రబాబుపై జగన్ ఫైర్
ప్రత్యక్ష సాక్షి వీడియోను జగన్‌కు చూపించిన సాయి కృష్ణ తల్లి