
రామగుండం ఎరువులు పొందేలా కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రతి నెల 2లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని అన్నారని.. కానీ హామీ ఇచ్చిన మేరకు కేంద్రం యూరియా సరఫరా ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు.
హైదరాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఎరువులు పొందేలా కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. ప్రతి నెల రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని అన్నారని..
కానీ హామీ ఇచ్చిన మేరకు కేంద్రం యూరియా సరఫరా ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. ఈరోజు (గురువారం) సచివాలయంలో మీడియాతో మంత్రి తుమ్మల మాట్లాడారు. ఢిల్లీకి వెళ్లి సరిపడా యూరియా తెలంగాణకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామని పేర్కొన్నారు.
తొలకరి వర్షానికే విత్తనాలు వేస్తే రైతులు నష్టపోతారు.. కేంద్రం ఎంఎస్పీ ప్రకటించి కొనుగోలు నుంచి తప్పుకుంటుందని మంత్రి తుమ్మల విమర్శించారు. ఒక్క గింజ మొక్కజొన్నని కూడా కేంద్రప్రభుత్వం ఎందుకు కొనలేదని నిలదీశారు. ఈ విషయాన్ని తెలంగాణ రైతాంగంపై కక్ష అనుకోవాలా..?
అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్తామని స్పష్టం చేశారు. తొలకరి వర్షానికే విత్తనాలు వేస్తే రైతులు నష్టపోతారని చెప్పారు. రెండుసార్లు వర్షం పడితేనే సరిపడా తడి వస్తుందని.. అన్నదాతలు ఈ విషయాన్ని గమనించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
తెలంగాణలో మేలుజాతి వంగడాల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తాం: భట్టి విక్రమార్క అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని
Read Latest AP News And Telangana News And National News