
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Kajal Aggarwal as Lawyer in The India Story First Look : కాజల్ అగర్వాల్‌కు పేరు నార్త్ భామ అయినా.. తెలుగు చిత్రాలతోనే మంచి పేరు సంపాదించుకుంది.
ఇక పెళ్లి తర్వాత కూడా ఈమె వరుసగా చిత్రాలు చేస్తోంది. ఆ మధ్య బాలయ్య హీరోగా ‘భగవంత్ కేసరి’ సినిమాతో పాటు ‘సత్యభామ’ సినిమాలతో పలకరించింది. తాజాగా ఈమె ‘ది ఇండియా స్టోరీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
లాయర్ పాత్రలో కాజల్ అగర్వాల్.. ఈ పోస్టర్లో కాజల్ అగర్వాల్ ఓ న్యాయవాదిగా, శ్రేయస్ తల్పడే కన్నకూతురుకు న్యాయం జరిగాలని కోర్టు మెట్లు ఎక్కిన తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్టు ఈ పోస్టర్‌ను చూస్తే తెలుస్తుంది. అలాగే శ్రేయస్ కుమార్తె పాత్రలో కనిపిస్తున్న చిన్నారి పాత్ర ద్వారా లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేస్తున్న ఒక తీవ్రమైన సమస్య నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.
ముంబై నేపథ్యంలో నిజ జీవితల సంఘటనల ఆధారంగా చిత్రం.. హైకోర్టు ఆఫ్ బాంబే నేపథ్యంతో రూపొందించిన ఈ పోస్టర్లో, సాక్షుల బోనులో ఉంచిన పురుగుమందు సిలిండర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆహార కల్తీ అనే అత్యంత కీలకమైన సమస్యపై సాగే కోర్ట్‌రూమ్ డ్రామాగా రాబోతుంది.
మన దేశంలో జరిగిన నిజ జీవిత సంఘటన నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి చెట్టన్ డీకే డైరెక్ట్ చేశారు. సాగర్ బి
. షిండే కథ, స్క్రీన్‌ప్లే అందించారు. జూలై 24, 2026న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది.
భారతదేశంలో ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యంత కీలకమైన, తరచూ నిర్లక్ష్యానికి గురయ్యే ఆహార కల్తీ సమస్యను ఈ చిత్రంలో ప్రస్తావించనున్నారు. సాధారణ ప్రజలు ప్రతిరోజూ వినియోగించే ఆహార పదార్థాల వెనుక దాగి ఉన్న ప్రమాదాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, సమాజంలో అవగాహన పెంచే ప్రయత్నం ఈ సినిమాతో చేయనున్నారు.
ఆహార కల్తీ నేపథ్యం.. ఆహార కల్తీ కారణంగా కుటుంబ సభ్యులు, కావాల్సిన వారిని కోల్పోయిన ప్రతి భారతీయుడి కథే ‘ది ఇండియా స్టోరీ’గా రాబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. మన సమాజంలో అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నప్పటికీ అత్యంత తీవ్రమైన సమస్యల్లో ఆహార కల్తీ ఒకటి. ఇది మనందరి రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే అంశమనే చెప్పాలి. ఈ సినిమా ద్వారా ఈ దాగి ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంతో పాటు, దీనిపై ఒక ముఖ్యమైన చర్చకు నాంది పలుకబోతున్నట్టు చెప్పారు.
నిర్మాణం.. ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా స్వాతి వినాయక్ సైందానే, అనితా జాధవ్, వినాయక్ సైదానే, కల్పేష్ షా, దేవయాని ఖోరాటే, ప్రేమ్ జోషి వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీని నిశాంత్ భాగవత్ అందిస్తున్నారు. సంగీతాన్ని మంగేష్ ధాక్డే అందించారు. ఆశిష్ మ్హాత్రే ఎడిటింగ్ నిర్వహించారు. హిత్యాన్ని షకీల్ అజామీ, సౌండ్ డిజైన్‌ను అన్మోల్ భావే అందిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.