
హైదరాబాద్: ప్రముఖ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ఓజ్రిట్ (Ozrit) తన నూతన కార్యాలయాన్ని హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సంస్థ నూతన లోగోను రాజ్యసభ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర ఆవిష్కరించగా.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారిక వెబ్సైట్ను ప్రారంభించారు. సంస్థ వ్యవస్థాపకులు, నాయకత్వ బృందంతో కేటీఆర్ సమావేశమై తెలంగాణలో టెక్నాలజీ, ఆవిష్కరణలు, ఉపాధి కల్పనలో ఓజ్రిట్ వంటి సంస్థలు పోషిస్తున్న పాత్రను అభినందించారు.
సంస్థ వ్యవస్థాపకులు భరత్ గుప్తా, వివేకానంద రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పరిశ్రమానుకూల విధానాలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం, పారిశ్రామికవేత్తలకు కల్పిస్తున్న అవకాశాలు తమలాంటి సంస్థలకు మరింత విస్తరణకు ప్రేరణగా నిలిచాయని తెలిపారు.
వ్యాపార సంస్థలకు వినూత్న, సమర్థమైన, వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన సాంకేతిక పరిష్కారాలను అందిస్తూ డిజిటల్ రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించడమే తమ లక్ష్యమని వివరించారు. ఓజ్రిట్ సంస్థ వెబ్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, కృత్రిమ మేధ (AI), ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, క్లౌడ్ సొల్యూషన్స్, UI/UX డిజైన్, ఆటోమేషన్, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో సేవలు అందిస్తూ దేశీయ, అంతర్జాతీయ ఖాతాదారులకు అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను అందిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) భక్తిపారవశ్యంలో మునిగిపోయారు
.