మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడానికి శరీరంలో జరిగే నిరంతర ప్రక్రియలను అన్నింటినీ కలిపి మెటబాలిజం రేటు (జీవక్రియ రేటు) అని అంటారు. దీని నుంచి వచ్చే ఎనర్జీ వల్లనే శ్వాస తీసుకోవడం, ఆలోచించడం, కదలడం వంటి అనేక పనులు సాధ్యమవుతాయి.
అయితే ఇలాంటి మెటబాలిజం బాగుంటే కేలరీలు తొందరగా కరిగిపోయి బరువు అదుపులో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ మెటబాలిజం మెరుగుపర్చే వెజ్ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, చిక్కుళ్లలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా లభిస్తాయి.
ఇవి జీర్ణం కావడానికి ఎక్కవ శక్తి అవసరం అవుతుంది. దీంతో కేలరీల ఖర్చు మెరుగుపడి బరువు అదుపులో ఉంటుంది. మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. పాలకూర, తోటకూర, మునగాకు, మెంతి ఆకులు వంటి ఆకుకూరల్లో ఐరన్ ఉంటుంది. ఇవి మెటబాలిజం ప్రక్రియను మెరుగుపర్చడానికి సహాయపడతాయి.
అలాగే కండరాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపరుస్తాయి. పచ్చిమిర్చిలో క్యాప్ససైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచి కేలరీలు తొందరగా ఖర్చయ్యేలా చేస్తుంది. దీంతో మెటబాలిజం కూడా బాగుంటుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇవి మెటబాలిజం రేటును మెరుగుపర్చి కేలరీలు తొందరగా ఖర్చు అయ్యేందుకు సహాయపడతాయి. అలాగే బరువు అదుపులో ఉంచుతాయి. ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాల్లో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎనర్జీని నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది.
బరువు అదుపులో ఉంచుతుంది. టోఫుతో పాటు టెంపేలో మొక్కల ఆధారిత ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మెటబాలిజం రేటును మెరుగుపర్చి బరువు అదుపులో ఉంచుతాయి. కండల బలాన్ని పెంచుతాయి. బాదం, అవిసె, చియా, గుమ్మడి వంటి గింజల్లో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.
ఇవి మెటబాలిజం రేటును మెరుగుపరుస్తాయి. బరువు అదుపులో ఉంచుతాయి. నిమ్మ, బత్తాయి, నారింజ, గ్రేప్‌ఫ్రూట్ వంటి పండ్లలో ఫైబర్ ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి మెటబాలిజం
రేటును మెరుగుపర్చి ఎనర్జీని పెంచుతాయి.