
SC ST Special Grievance Day | నెల్లూరు, జూన్ 18: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 18న ఉద్యోగుల గ్రీవెన్స్ డేతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, సంఘాలకు ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, సంఘాల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ సమస్యలు, వినతులను నేరుగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ముందస్తుగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, సంఘాలకు సమాచారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, సంఘాలు ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు.
Himachal Pradesh Road Accident: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బొలెరో, ఏడుగురు దుర్మరణం గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
AP Govt Doctors Dismissed: ఏపీలో విధులకు గైర్హాజరైన 43 మంది డాక్టర్ల తొలగింపు El Nino Impact AP Farming: ఎల్‌నినో పరిస్థితులపై సమీక్ష.. వ్యవసాయ శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశాలు Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట Chandrababu Naidu: సాయి కృష్ణ మిస్సింగ్
కేసుపై సీఎం చంద్రబాబు డీజీపీకి ఆదేశాలు
Chandrababu Naidu: యోగాంధ్ర-2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
Pawan – Perni Nani : పవన్ తెలంగాణ పర్యటన పై పేర్ని నాని సెటైర్లు