
ధర్మపురి, న్యూస్టుడే: రెండు కోతులు పోట్లాడుతూ సిమెంట్ ఇటుకను కిందపడేయటంతో అది తలపై పడి మహిళ దుర్మరణం పాలైన విషాద ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటుచేసుకుంది. ఎస్సై జి.మహేష్ కథనం ప్రకారం..
పట్టణంలోని కమలాపూర్ రోడ్డు ఇందిరమ్మ కాలనీలో దంపతులైన కొనపర్తి సత్యనారాయణ, పద్మ(55) నివాసం ఉంటున్నారు. పద్మ బుధవారం సాయంత్రం ఇంటి ముందు కూర్చొని మరో మహిళతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఆ ఇంటిపై కప్పిన రేకులపై చేరిన కోతులు తీవ్రంగా పొట్లాడుకోసాగాయి. ఈ క్రమంలో రేకులు గాలికి ఎగిరిపోకుండా బరువు కోసం పెట్టిన ఓ సిమెంట్ ఇటుక కింద కూర్చున్న పద్మ తలపై పడడంతో బలమైన గాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.