
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఇటీవల తెలంగాణలో కొందరు ఎలాంటి ఆరోపణలు చేశారో తెలియంది కాదు. అలాంటి వారందరికీ ఝలక్ ఇస్తూ.. బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పై ఇటీవల తెలంగాణలో కొందరు ఎలాంటి ఆరోపణలు చేశారో తెలియంది కాదు.
ఆయన తెలంగాణ రాష్ట్రం (Telangana State)లోని భూమిని ఆక్రమించుకున్నారని, అది, ఇది అంటూ తెగ హడావుడి చేశారు. పవన్ కళ్యాణ్‌ని తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వమంటూ కొందరు అదే పనిగా మీడియా మీట్లను నిర్వహిస్తూనే ఉన్నారు. అలాంటి వారందరికీ ఝలక్ ఇస్తూ..
బెంగళూరు కోర్టు (Bangalore Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట లభించింది. అసలు విషయంలోకి వస్తే.. పవన్ కళ్యాణ్‌పై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తూ చేసిన పోస్టులపై కోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా గ్రూప్‌లను కోర్టు ఆదేశించింది. ట్విట్టర్, గూగుల్, మెటా సంస్థలకు అత్యవసర నోటీసులు ఇస్తూ.. అనామక అకౌంట్లపై కోర్టు ‘జాన్ డో’ (John Doe) ఆర్డర్ జారీ చేసింది.
ఒక వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్న నిర్దిష్ట యూఆర్ఎల్లను వెంటనే బ్లాక్ చేయాలని ఆయా సంస్థలకు జారీ చేసిన ఆదేశాల్లో కోర్టు పేర్కొంది. జూలై 24వ తేదీకి ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లుగా కోర్టు ప్రకటించింది.
రీసెంట్గా తెలంగాణలోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా తెగ ప్రచారం నడిచింది. తెలంగాణలో జనసేన పార్టీ తరపున ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ పెట్టుకునేందుకు అనుమతులు అడిగినా..
, స్థలం సరిపోదనే కారణంతో ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వలేదు. అనంతరం పవన్ కళ్యాణ్ తన ఇంటి వద్దే మీడియా సమావేశం నిర్వహించి, తనపై వస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలపై స్పందించారు. ఆక్రమించినట్లుగా నిరూపిస్తే.. తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తానని సవాల్ విసిరారు. ఆ తర్వాత ఆయనపై దుష్ప్రచారం చేసిన వారంతా తోకముడిచిన విషయం తెలిసిందే.
సోలో హీరోగా 400 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్.. ఆడు ‘పెద్ది’ సారొ!
మంచు విష్ణు ‘కన్నప్ప’ రీ రిలీజ్.. ఈ సారైనా?
‘బెంగళూరు నాగరత్తమ్మ’.. సింగీతం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చేదెవరో..
అల్లర్లు