
రెండో వన్డేలో అఫ్గాన్ పై భారత్ ఘన విజయం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ కైవసం IND vs AFG : అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలి...
రెండో వన్డేలో అఫ్గాన్ పై భారత్ ఘన విజయం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ కైవసం IND vs AFG : అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. లక్నో వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో అఫ్గాన్ పై భారత్ 150 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి వన్డేలోనూ భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టు 44.3 ఓవర్లలో 232 పరుగులకు కుప్పకూలింది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్ షా (79; 89 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. సెదీఖుల్లా అటల్ (42), రహ్మానుల్లా గుర్బాజ్ (41)లు రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ చెరో మూడు వికెట్లు తీశారు. ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ సాధించాడు. FIFA World Cup 2026 : ఆస్ట్రియా గోల్ కొట్టినా ఇవ్వని రిఫరీ.. అతడే కారణం.. ఆ ఒక్కడు చూడకుంటే..? A clinical performance to seal the series! 🙌#TeamIndia register a massive 170-run victory in the 2nd ODI to take an unassailable 2-0 lead 👏 Updates ▶️ | @IDFCFIRSTBank — BCCI (@BCCI) June 17, 2026 అంతకముందు కెప్టెన్ శుభ్మన్ గిల్ (154; 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (125; 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ శతకాలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. Lionel Messi : ఫిఫా ప్రపంచకప్ 2026లో తొలి గోల్ కొట్టగానే కన్నీటిపర్యంతమైన మెస్సీ.. భారత బ్యాటర్లలో ఓపెనర్ రోహిత్ శర్మ (48; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. శ్రేయ్యర్ అయ్యర్ (26; 24 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (19; 19 బంతుల్లో 1 ఫోర్) రాణించారు. యశస్వి జైస్వాల్ (4), కేఎల్ రాహుల్ (0)లు విఫలం అయ్యారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో నంగ్యాలియా ఖరోటి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు. గజన్ఫర్, మహ్మద్ సలీమ్ సఫీలు చెరో వికెట్ పడగొట్టారు.