
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Khammam Politics: 'రాష్ట్రంలో రెవెన్యూ పడిపోతా ఉంది. కానీ రెవెన్యూ మంత్రి (పొంగులేటి శ్రీనివాస రెడ్డి) అవినీతి సామ్రాజ్యం వందల వేల రెట్లు పెరిగిపోయింది. బాంబుల మంత్రి పొంగులేటి ఎంత సంపాదించాడంటే నోట్లు లెక్కపెట్టే మెషీన్లు కూడా అలసిపోతున్నాయి. రెండు సంవత్సరాల కింద ఈడి దాడి చేసిన ఇప్పటిదాకా దానిపైన కనీస ప్రకటన రాలేదు. ఆనాడు ఈడీ దాడి చేసి పట్టుకున్న రూ.వందల కోట్లపైన కనీసం ప్రకటన లేదు. పొంగులేటి ఈడీ దాడిపై బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు మాట్లాడలేదు?' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 'రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది కానీ డిప్యూటీ సీఎం భట్టి ఆదాయం, కమీషన్ దందాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి' అని భట్టి విక్రమార్కపై కూడా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.
బీజేపీతో పొంగులేటి లాలూచీ పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'బీజేపీతో పొంగులేటికి ఉన్న లాలూచీ కారణంగానే ఈడీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై కేసు పెట్టలేదు. తెలంగాణలో కోటి ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో వివాదస్పద జాబితాలో పెట్టి వాటిని దోచుకుంటున్నాడు. కోటి ఎకరాలపైన ఆంక్షలు పెట్టి ఆ భూములను బెదిరించి సెటిల్మెంట్లు చేయించుకుంటూ నికృష్టమైన పనులు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి దొంగ అయితే పొంగులేటి గజ దొంగ మాదిరిగా దోచుకుంటున్నాడు. పొంగులేటి డైలాగులు, అహంకారం ప్రజలందరూ చూశారు' అని పొంగులేటిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
ఎంత అహంకారం? 'పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీసీ మంత్రులు కొండా సురేఖని మాట్లాడనియ్యకుండా మైక్ కట్ చేశారు. పక్కన ఉన్న మరో బీసీ మంత్రి వాకిటి శ్రీహరి మీద కాగితాలు విసిరేశారు. ఎంత అహంకారం కాకుంటే తోటి మంత్రులతో అంత అహంకారంగా ప్రవర్తిస్తాడు. బీసీ మంత్రులు కూడా పొంగులేటి మాదిరే ప్రజలతో ఎనుకోబడ్డ వారు అని గుర్తుంచుకోవాలి' అని పొంగులేటికి కేటీఆర్ హితవు పలికారు. 'అధికారులను పట్టుకొని సెన్సు ఉందా అని అహంకారంతో పొంగులేటి మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను నీకు సెన్స్ ఉందా పొంగులేటి? ఇష్టానుసారంగా దోచుకోవడానికి, అక్రమ మైనింగ్ చేయడానికి నీ కుమారుడిని అడ్డుపెట్టుకొని వట్టినాగులపల్లిలో గజదొంగల భూములు దోచుకోవడానికి నీకు సెన్స్ ఉందా అని అడుగుతున్నారు' అని మండిపడ్డారు.
పాలేరులో ఎగిరేది గులాబీ జెండా 'వట్టినాగులపల్లిలో పదుల ఎకరాలపైన మీ కొడుకు, కిరాయి మూకలు పంపి వాళ్లపై దాడి చేసింది వాస్తవం కాదా? నీ కొడుకుపై పోలీస్ కేసు నమోదు చేస్తే ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవం కాదా? నీ అన్యాయాలు, అక్రమాలు అహంకారం ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నావా?' అని పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. అందుకే పాలేరులో ఎప్పుడు ఎన్నిక వచ్చినా గులాబీ జెండా మాత్రమే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మాట మీద నిలబడే సత్తా ఉందా? 'గృహ నిర్మాణ శాఖ మంత్రిగా 20 లక్షల ఇండ్లు కడితేనే ఓట్లు అడుగుతా అన్నావు కదా ఆ మాట మీద నిలబడే సత్తా ఉన్నదా? మరి సగం కాలం అయిపోయింది 10 లక్షల ఇండ్లు కట్టావా? లేదా నువ్వు కడతా అన్న 20 లక్షల ఇండ్లు నీ రాఘవ కంపెనీ ఏమైనా కడుతుందా? ఖమ్మంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎన్ని ఇండ్లు ఇచ్చావు?' అని పొంగులేటిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వారికి రూ.6 లక్షలు ఇండ్లు కట్టుకోవడానికి ఇస్తామన్నావు ఆ మాట ఎక్కడ పోయింది? అని అడిగారు.
కమీషన్ల కుమ్ములాటలో మంత్రులు 'అయినా నీకు ఇల్లు కట్టే తెలివి ఎక్కడిది, వెలుగుమట్ల మాదిరి ఇండ్లు కూలగొట్టడం, విధ్వంసం తప్ప వికాసం తెల్వదు. విధ్వంసం తప్ప వికాసం తెలవని దండుపాళ్యం ముఠా మీది' అని కాంగ్రెస్ నాయకులపై మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ రైతుల నుంచి పీల్చి పిండుకున్న భూమి శిస్తు కేసీఆర్ తీసేశారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మళ్లీ భూమి శిస్తు పెట్టి రైతులను వేధించేందుకు సిద్ధమవుతున్నదని తెలిపారు. రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి భూమి శిస్తు పెడతామని చెబుతున్నారు. భూమి శిస్తు పేరుతో రైతుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తారా? ములుగు జిల్లాలో పొంగులేటి వేల కోట్ల ఇసుక దందా కోసం స్కెచ్ వేశాడు, చివరికి సమ్మక్క సారక్క జాతర్ల టెండర్లను కూడా పొంగులేటి వదిలిపెట్టలేదు. సమ్మక్క సారక్క జాతరలో కూడా కమీషన్ల కుమ్ములాటల కోసం మంత్రులు కొట్లాడుకున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.