
Ap deputy cm Pawan kalyan thanks to cm revanth reddy: పవన్ కళ్యాణ్ బాలుడు నిరంజన్ తో భేటీ అయి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు. అంతే కాకుండా వెంటనే రూ. లక్ష సాయం అందించారు. తన మూవీ ఓజీ2 కి నువ్వె నా చీఫ్ గెస్ట్ అంటూ నిరంజన్ ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమాని ప్రాణాంతక వ్యాధి సమస్యలతో పొరాడుతున్న నిరంజన్ కోరిక మేరకు హనుమ కొండ చేరుకున్నారు. నేరుగా బాలుడి ఇంటికి వెళ్లి చాలా సేపు మాట్లాడారు. ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులకు అండగా ఉండాలని క్యాంటిన్ పెట్టించాలని జనసేన నాయకుల్ని ఆదేశించారు.
చాలా సేపు మాట్లాడి ధైర్యం చెప్పి, సెల్ఫీలు దిగి తానున్నానని భరోసాను ఇచ్చారు. ఆ తర్వాత వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి ఆలయంకు వెళ్లి అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో హనుమ కొండ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ట్విట్ చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ… నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను. నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భావించి వచ్చినట్లు చెప్పారు. అరుదైన వ్యాధితో నిరంజన్ చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకమన్నారు.
తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయమన్నారు. నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించానని చెప్పారు. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానట్లు పేర్కొన్నారు.
నా వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ట్విట్ చేశారు.
తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయన్నారు. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటానని అన్నారు. ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ప్రత్యేకంగా ట్విట్ చేశారు.
భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలన్నారు. అదే సమయంలో ఈ రోజు