
Adarsha Kutumbam Movie: చిత్ర పరిశ్రమలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత స్క్రిప్ట్‌లో మార్పులు జరగడం కొత్తేమీ కాదు. దర్శకులు షూటింగ్ సమయంలో కొన్ని సీన్లను మార్చడం సహజమే. కానీ, ప్రస్తుతం టాలీవుడ్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నెం.47) చిత్రంలో కథ పరంగా కొన్ని కీలక మార్పులు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. Read Also : Singeetham Movie: ‘సింగ్ గీతం’ ఓటీటీ రిలీజ్లో నాగ్ అశ్విన్ కీలక మార్పులు!
ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన ఒక సినిమా కథకు, ఈ ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి చాలా పోలికలు ఉన్నాయట. ఈ రెండు సినిమాల ప్రధాన కథాంశాలు ఒకేలా ఉన్నాయనే విషయం చిత్ర యూనిట్ దృష్టికి రావడంతో, మేకర్స్ వెంటనే అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.
సినిమా విడుదలయ్యాక కాపీ వివాదాలు రాకుండా ఉండేందుకు ముందుచూపుతో అడుగులు వేస్తున్నారు. ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నప్పటికీ.. కథలో, కొన్ని కీలక సన్నివేశాలలో భారీ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాను వెండితెరపై చూసేటప్పుడు ప్రేక్షకులకు ఇటీవల విడుదలైన ఆ హిట్ సినిమా ఛాయలు ఎక్కడా కనిపించకూడదనే ఉద్దేశంతో, త్రివిక్రమ్ అండ్ టీం సెట్స్‌లోనే సీన్లను రీ-రైట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. కథనంలో సరికొత్త ట్విస్టులు జోడించి, ఇప్పటికే హిట్టయిన ఆ చిత్రానికి పూర్తి భిన్నంగా దీనిని ప్రెజెంట్ చేయడానికి చిత్ర యూనిట్ గట్టి కసరత్తులు చేస్తోందట.
మరి ఈ మార్పులు వెంకీ-త్రివిక్రమ్ సినిమాకు ఎలాంటి ప్లస్ కానున్నాయో తెలియాలంటే సినిమా వెండితెరపైకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే. Sanchita Ugale: సుశాంత్ వర్ధంతి రోజే నటి సంచిత ఆత్మహత్య.. సోదరుడి సంచలన ఆరోపణలు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన
వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Singeetham Movie: ‘సింగ్ గీతం’ ఓటీటీ రిలీజ్లో నాగ్ అశ్విన్ కీలక మార్పులు!
Ramani Kalyanam Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘రమణి కల్యాణం’
Arbaaz Khan: కోల్‌కతాలో నటుడు అర్బాజ్ ఖాన్ కారులో గుర్తుతెలియని వ్యక్తి
Allu Arjun Happy Re Release: అల్లు అర్జున్ హ్యాపీ మూవీ రీ రిలీజ్ కేరళ బాక్సాఫీస్ రికార్డు
Nani Paradise Movie: నాని ‘ప్యారడైజ్’ మూవీ విడుదల వాయిదా?
Raakh Web Series: క్రైమ్ థ్రిల్లర్ ‘రాఖ్’ సిరీస్ రివ్యూ!