
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన గిల్..
Jun 17 2026 3:48 PM | Updated on Jun 17 2026 4:17 PM
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన గిల్.. కేవలం 77 బంతుల్లో తన 9వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
యశస్వి జైశ్వాల్ తుది జట్టులో చోటు దక్కడంతో గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే జైశ్వాల్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. కేవలం 4 పరుగులు చేసి ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు.
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన గిల్, తన రెగ్యులర్ ఓపెనర్ పార్టనర్ రోహిత్ శర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడడంతో భారత స్కోర్ పవర్‌ప్లేలో 80 పరుగుల మార్క్ దాటింది.
అనంతరం రోహిత్ ఔటైనప్పటికి శుబ్‌మన్ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రోహిత్ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ సైతం అఫ్గాన్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
ఈ క్రమంలో కిషన్ కూడా కేవలం 71 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్(86 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లతో 121), కిషన్(111) అజేయంగా తమ బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు అహ్హానించింది. లక్నో పేసర్ ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్‌తో భారత్ తరపున అరంగేట్రం చేశాడు.
తుదిజట్లు భారత్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్
అఫ్గనిస్తాన్ రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఏఎమ్ ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ సఫీ, బిలాల్ సమీ. చదవండి: IND vs AFG: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ముంబై : 'IWMBuzz డిజిటల్ అవార్డ్స్ సీజన్ 8'..మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)
RRR చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి (ఫోటోలు)
చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ (ఫోటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ సందడి..శ్రుతి హాసన్ ఆటా.. పాట (ఫోటోలు)
వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)
బిగ్ ట్విస్ట్, హైకోర్టులో సవాల్ చేసిన టెలిగ్రామ్
కాల్చేసి బూడిద చేసి, కోర్టులో వెతుకుతున్నాం అని చెప్తున్నారే
ఈ 7 విషయాలు ఫాలో అయితే మీకు డాక్టర్ అవసరం ఉండదు..
Cockroach Party: 'కాక్రోచ్' అభిజీత్‌పై దాడి చెంపపై కొట్టిన యువకుడు