
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో దంబుల్లా వేదికగా భారత్-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు తలపడుతున్నాయి. అయితే వైభవ్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో దంబుల్లా వేదికగా భారత్-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఎ జట్టు 9 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.
అయితే వైభవ్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. షామ్స్ బౌలింగ్‌లో వైభవ్ ఇచ్చిన క్యాచ్‌ను ఫరూదూన్ అద్భుతంగా అందుకున్నాడు. కానీ థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో వివాదం రాజుకుంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే షామ్స్ బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన క్యాచ్‌ను ఫరూదూన్ అద్భుతంగా ఒడిసిపట్టాడు.
వైభవ్ సహా అఫ్గాన్ ప్లేయర్లు కూడా క్లియర్ క్యాచ్ అని అనుకున్నారు. వైభవ్ పెవిలియన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ రీప్లేలో థర్డ్ అంపైర్ చెక్ చేసి బంతి కాస్త నేలను తాకినట్లు అనిపించిందని నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై అఫ్గాన్ ఆటగాళ్లు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.
మైదానంలో ఉన్న అంపైర్లతో వాగ్వాదానికి దిగుతూ వివరణ కోరారు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో వైభవ్ డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి బయట పడ్డాడు. అయితే ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రీప్లేలో క్యాచ్ క్లియర్‌గా కనిపించిందని..
థర్డ్ అంపైర్ సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో వైభవ్ డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి బయట పడ్డాడు. ఆ తర్వాత కూడా అతడికి మరో అవకాశం లభించింది. అయినప్పటికీ వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
పాయింట్లో ఖలీద్ సులభంగా క్యాచ్ అందుకున్నాడు. కాగా, గత మ్యాచ్‌లో శ్రీలంక-ఎ ఆటగాడిని వైభవ్ తోసిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు థర్డ్ అంపైర్ నిర్ణయ వివాదం కారణంగా వైభవ్ మరోసారి వార్తల్లో నిలవడం గమనార్హం.
విరాట్ కోహ్లీ.. భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదు: జాంటీ రోడ్స్
38 పరుగుల వద్ద ఫరూదూన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి ఔటయ్యాడు. కవర్