
Pawan Kalyan visits ailing fan Niranjan : తన అశేష అభిమాన బలగంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే పవన్ కళ్యాణ్, తాజాగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన వీరాభిమాని నిరంజన్ను కలిసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ భేటీ నిరంజన్ జీవితంలో మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.
నిరంజన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించిన పవన్, అతనిలో ధైర్యాన్ని నింపేందుకు ఒక అద్భుతమైన హామీ ఇచ్చారు. “మనం ఇద్దరం కలిసి థియేటర్లో ‘OG’ సినిమా చూద్దాం.. ఒకవేళ ‘OG-2’ సినిమా గనుక తీస్తే, దానికి నువ్వే నా ప్రత్యేక అతిథివి (స్పెషల్ గెస్ట్)” అని పవన్ ప్రకటించడంతో నిరంజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తన అభిమాన హీరో చూపించిన ఈ ఆదరణకు, ప్రేమకు ఆ అభిమాని కళ్లల్లో ఆనందబాష్పాలు రాలాయి. Read Also : విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసు.. ఎందుకు? ఈ ప్రత్యేక ముఖాముఖి సందర్భంగా నిరంజన్ తన మనసులోని మరో కోరికను పవన్ ముందు ఉంచాడు. తనతో కలిసి భోజనం (లంచ్) చేయాలని కోరగా..
దానికి పవన్ ఏమాత్రం సంకోచించకుండా, తానే స్వయంగా నిరంజన్ను లంచ్‌కు తీసుకెళ్తానని మాట ఇచ్చారు. అంతేకాకుండా, నిరంజన్ తెచ్చిన ప్రత్యేక డైరీ, ఫొటోలపై పవన్ కళ్యాణ్ తన ఆటోగ్రాఫ్ ఇస్తూ.. “ప్రియమైన నిరంజన్ కి ప్రేమతో.. దుర్గమ్మ ఆశీస్సులతో చల్లగా ఉండాలి” అని మనస్ఫూర్తిగా రాసి ఆశీర్వదించారు.
ఒక అగ్ర నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్న తన అభిమాని కోసం సమయం కేటాయించి, అతనిలో జీవించేందుకు కొండంత భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. Achchennaidu: వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నష్టం: అచ్చెన్నాయుడు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి
చేస్తాము.
Khammam : ముగ్గురు మంత్రులు మోసగాళ్లే – కేటీఆర్
CM Revanth : రేవంత్ చేతగానితనం వల్లే తెలంగాణ లో బాబు, పవన్ రాజకీయాలు – కవిత
Jowar Purchase Center Medak: జొన్నల కొనుగోలు కేంద్రంలో లారీల కొరత.. రైతుల రాస్తారోకో
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసు.. ఎందుకు?
Telangana Clean Energy Summit 2026: రేపే తెలంగాణ క్లీన్ ఎనర్జీ సమ్మిట్
Medak District Land Survey: భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం: ఎమ్మెల్యే సంజీవరెడ్డి