
ఇంటర్నెట్‌డెస్క్: ముంబయిలోని ఐనాక్స్ (Mumbai INOX) కంపెనీకి కొందరు కేటుగాళ్లు టోకరా వేశారు. బాస్‌లా బురిడి కొట్టించి.. రూ.10 కోట్లకు పైగా కాజేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..
ఐనాక్స్ కంపెనీలోని అకౌంట్స్ విభాగంలో గిరీష్ అమిన్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల ఆరంభంలో అతడి ఫోన్‌కి గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సప్ సందేశం వచ్చింది. దాన్ని పంపిన వ్యక్తి తనని తాను కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్‌గా పరిచయం చేసుకున్నాడు.
అది తన వ్యక్తిగత నంబర్ అని.. దాన్ని ఎవరికీ ఇవ్వొద్దని తెలిపాడు. ఆ నంబర్‌కు సంబంధించి డీపీ కూడా జైన్ ఫొటో ఉండటంతో ఆ ఉద్యోగి అది బాస్ నంబరేనని నమ్మేశారు. అత్యవసరంగా ఓ మీటింగ్‌కు వెళ్తున్నా అని చెప్పి.. ఓ బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేయాలని ఆ నకిలీ బాస్ ఆదేశించాడు.
దీంతో, నిజంగా తన బాస్ అనుకొని ఆ ఉద్యోగి రూ.46.5 లక్షలను పంపించారు. ఇలా జూన్ 3 నుంచి 15 మధ్య బాస్ అని నమ్మించిన వ్యక్తికి 63 సార్లు దాదాపు రూ. 10.4 కోట్లు మేర బదిలీ అయ్యాయి. ఇటీవల అకౌంట్స్ చెక్ చేసే సమయంలో.. ఈ నకిలీ బాస్ వ్యవహారం బయటపడింది.
ఈ ఘటనపై ఉద్యోగి ఫిర్యాదు మేరకు ముంబయి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమాచారం ఆధారంగా నలుగురిని అరెస్టు చేశారు. ఈ నెట్‌వర్క్‌లో మరికొంత మంది ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు.. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఆయా ఉత్పత్తులు