
ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనం 'గ్రోక్' (Grok)ను ఇరాన్‌పై సైనిక దాడుల కోసం వినియోగించినట్లు అమెరికా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ అత్యాధునిక సాంకేతికత సాయంతో కేవలం 96 గంటల వ్యవధిలోనే ఇరాన్‌లోని 2,000 విభిన్న లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు వెల్లడించింది.మస్క్‌కు చెందిన 'ఎక్స్ఏఐ' డేటా సంస్థ డేటా సెంటర్లకు సంబంధించిన ఒక పర్యావరణ కేసు విచారణ సందర్భంగా అమెరికా న్యాయశాఖ ఈ వివరాలను న్యాయస్థానానికి సమర్పించింది.
జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా 'ఎక్స్ఏఐ' కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని ఈ సందర్భంగా వాదించింది. ఇందుకు మద్దతుగా పెంటగాన్ ఏఐ విభాగాధిపతి కామెరాన్ స్టాన్లీ ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టుకు అందజేసింది.అమెరికా సైన్యానికి చెందిన 'ప్రాజెక్ట్ మావెన్' అనే ఏఐ టార్గెటింగ్ వ్యవస్థలో గ్రోక్‌ను అంతర్భాగం చేసినట్లు స్టాన్లీ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌పై చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో డ్రోన్ ఫుటేజీని వేగంగా విశ్లేషించడంలోనూ, లక్ష్యాలను కచ్చితంగా గుర్తించడంలోనూ గ్రోక్ కీలక పాత్ర పోషించిందని ఆయన వివరించారు.గతంలో ఈ ప్రాజెక్ట్ కోసం పెంటగాన్ 'ఆంథ్రోపిక్' సంస్థకు చెందిన 'క్లాడ్' అనే ఏఐ మోడల్‌ను వినియోగించింది. అయితే, నిఘా పద్ధతులపై తలెత్తిన విభేదాల కారణంగా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో, ఆ స్థానంలో గ్రోక్‌ను చేర్చుకున్నారు.
ప్రైవేట్ సాంకేతిక సంస్థలు సైనిక కార్యకలాపాల్లో ఏ స్థాయిలో భాగమవుతున్నాయో ఈ పరిణామం స్పష్టం చేస్తోంది
.