
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లిష్ ఛానెల్లో రష్యా యుద్ధ నౌక వ్యవహరించిన తీరుపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లిష్ ఛానెల్లో రష్యా యుద్ధ నౌక వ్యవహరించిన తీరుపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
బ్రిటన్ ప్రాదేశిక జలాల సమీపంలో బ్రిటన్ జెండా కలిగిన ఓ పౌర పడవ (Yacht)ను దారి మళ్లించేందుకు రష్యా యుద్ధ నౌక హెచ్చరిక కాల్పులు జరిపింది. ఈ చర్యను బ్రిటన్ ప్రధాని పూర్తిగా నిర్లక్ష్యపూరితమైనదని, ఆందోళనకరమైనదని అభివర్ణించారు (UK Russia tensions).
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. తమ యుద్ధనౌక అడ్మిరల్ గ్రిగోరోవిచ్ (Admiral Grigorovich)కు బ్రిటిష్ పడవ చాలా దగ్గరగా వచ్చింది. పలుమార్లు రేడియో ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు. దీంతో ముందుగా హెచ్చరిక సంకేతాలు ఇచ్చి, అనంతరం చిన్న ఆయుధాలతో హెచ్చరిక కాల్పులు జరిపారు.
దీంతో యాచ్ తన దిశను మార్చుకుని దూరంగా వెళ్లింది (Russian warship, British yacht). రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనను యాచ్‌లో ప్రయాణిస్తున్న బ్రిటిష్ దంపతులు ఖండించారు (English Channel incident). తాము ఢీకొనేంత దగ్గరకు వెళ్లలేదన్నారు.
యుద్ధనౌక హారన్ మోగించడంతో దిశ మార్చుకున్నామని, అయినప్పటికీ కాల్పులు జరిపారని తెలిపారు. జీ7 సదస్సు కోసం ఫ్రాన్స్‌లో ఉన్న బ్రిటన్ ప్రధాని ఈ ఘటనపై స్పందించారు. 'ఇది అసలు జరగకూడని ఘటన. యాచ్‌లో ఉన్న దంపతులు తీవ్ర భయాందోళనకు గురై ఉంటారు' అని అన్నారు.
బ్రిటన్ రక్షణ శాఖ కూడా ఈ చర్యను ఆందోళనకరమైనదిగా పేర్కొంది. మస్క్ సంపద ఎంతంటే.. గంటకు రూ. 9.5 కోట్ల చొప్పున 114 ఏళ్లు ఖర్చుపెట్టినా తరగదు.. సూచీలకు కొనుగోళ్ల అండ.. వరుసగా మూడో రోజూ లాభాల్లోనే
..