
ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్‌రావు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. రూ.1100 కోట్ల టెండర్లో రూ.2 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం తిమ్మాపూర్ నుంచి నగరానికి ఆర్టీసీ బస్సులో మంత్రులు ప్రయాణం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ వార్త చదివారా: బాలుడి కోరిక నెరవేర్చిన పవన్ కల్యాణ్