
దంబుల్లా: అఫ్గానిస్థాన్-‘ఎ’తో జరుగుతున్న వన్డేలో భారత్ ‘ఎ’ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన తిలక్ బృందం.. నిర్ణీత 50 ఓవర్లలో 319/8 స్కోరు చేసింది. తిలక్ వర్మ (59), ప్రియాంశ్ ఆర్య (58), కుమార్ కుశాగ్ర (58) హాఫ్ సెంచరీలు చేశారు.
వైభవ్ సూర్యవంశీ (38), రుతురాజ్ గైక్వాడ్ (30), విప్రజ్ నిగమ్ (30) పరుగులు చేశారు. దావూద్జాయ్, అహ్మద్జాయ్, సఫీ చెరో రెండు వికెట్లు, జహీర్ ఖాన్ ఒక వికెట్ తీశారు. అదరగొట్టిన భారత్-ఎ.. అఫ్గాన్ టార్గెట్ 320
|