
అమెరికా రక్షణ వ్యవస్థకు చెందిన కీలక సైనిక కమాండ్ పేరును మార్చడం, అదే సమయంలో భారత్‌కు సంబంధించిన తప్పు మ్యాప్‌ను ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. ‘ఇండో-పసిఫిక్ కమాండ్’గా కొనసాగుతున్న సంస్థను మళ్లీ ‘పసిఫిక్ కమాండ్’గా మార్చుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.
అయితే ఆ కమాండ్ వెబ్సైట్లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను (పీఓకే) పాకిస్థాన్‌లో భాగంగా చూపించడం వివాదానికి దారితీసింది.2018లో అప్పటి అమెరికా రక్షణ మంత్రి జిమ్ మ్యాటిస్ ఈ కమాండ్‌కు ‘ఇండో-పసిఫిక్ కమాండ్’గా పేరు మార్చారు. హిందూ మహాసముద్ర ప్రాంత ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌తో పాటు ఇండో-పసిఫిక్ వ్యూహానికి ప్రాధాన్యం ఇస్తున్నామనే సందేశాన్ని అప్పట్లో అమెరికా పంపింది.
ఇప్పుడు ఆ పేరును తొలగించి మళ్లీ పాత పేరైన ‘యూఎస్ పసిఫిక్ కమాండ్’ను తీసుకొచ్చింది.ఈ నిర్ణయం వెనుక ఎలాంటి వ్యూహాత్మక మార్పులు లేవని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది. కమాండ్ చరిత్ర, వారసత్వాన్ని గౌరవించేందుకే ఈ పేరు మార్పు చేపట్టినట్లు వెల్లడించింది.
పసిఫిక్ ప్రాంతంలో సేవలందించిన సైనికుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించడమే లక్ష్యమని పేర్కొంది.అధికారుల ప్రకారం పేరు మాత్రమే మారుతోంది. కమాండ్ బాధ్యతలు, వ్యూహాత్మక లక్ష్యాలు, కార్యకలాపాల పరిధిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
అమెరికా పశ్చిమ తీర ప్రాంతం నుంచి భారత్ పశ్చిమ సరిహద్దుల వరకు విస్తరించిన కార్యకలాపాల పరిధి యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. మిత్రదేశాలతో కలిసి స్వేచ్ఛాయుత, భద్రమైన సముద్ర ప్రాంతాల లక్ష్యానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.1947 జనవరి 1న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ హయాంలో ఈ