Bonus Issue: మిడ్ క్యాప్ కేటగిరీలోని స్థిరాస్తి రంగంలోని ప్రముఖ కంపెనీ బ్రిగెడ్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (Brigade Enterprizes Ltd) స్టాక్ ఇవాళ భారీగా పడిపోయింది.
మార్కెట్ ఆరంభంలోనే 20 శాతం పడిపోయి ట్రేడింగ్ మొదలు పెట్టింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఆందోళన పడ్డారు. అయితే, ఈ స్టాక్ పడిపోయినప్పటికీ షేర్ హోల్డర్లకు మేలు జరిగింది. అరే అదేంటి, స్టాక్ పడిపోతే నష్టం రావాలి కదా? అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే, ఇక్కడే మీరు స్టాక్ మార్కెట్లో ఉండే మ్యాజిక్ తెలుసుకోవాలి. షేరు ధర పెరిగినప్పుడు లాభాలు రావడం ఒక్కటే కాదు కంపెనీలు తీసుకునే కొన్న నిర్ణయాలూ షేర్ హోల్డర్లకు లబ్ధి చేకూర్చుతాయి. అదే తరహాలో బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ బోనస్ ఇష్యూ సైతం 1.5 లక్షల మంది చిన్న ఇన్వెస్టర్లకు లబ్ధి చూకూర్చింది.బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ బోర్డ్ డైరెక్టర్స్ కొద్ది రోజుల క్రితం 1:3 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి రికార్డ్ తేదీని జూన్ 17,2026గా నిర్ణయించారు. అంటే ఈరోజు ఈస్టాక్ ఎక్స్ బోనస్ ట్రేడింగ్ నిర్వహించింది. జూన్ 16వ తేదీన మార్కెట్లో ముగిసే నాటికి ఈ కంపెనీలో షేర్లు కొనుగోలు చేసి కొనసాగిన వారికి అర్హత లభిస్తుంది. అంటే ప్రతి 3 షేర్లకు 1 షేరు ఉచితంగా లభిస్తుంది. ఉదాహరణకు మీ వద్ద 30 షేర్లు ఉంటే 10 షేర్లు, 300 షేర్లు ఉంటే 100 షేర్లు బోనస్ రూపంలో ఉచితంగా వస్తాయి. అంటే 3 షేర్లు ఉన్న వారికి 4 షేర్లు, 30 షేర్లు ఉన్న వారికి 40 షేర్లు అవుతాయి.ఒక్కరోజే 20 శాతం నష్టం ఎలా?ఈ కంపెనీ స్టాక్ చివరి ట్రేడింగ్ సెషన్లో రూ. 670 స్థాయిలో ట్రేడింగ్ అయింది. అయితే జూన్ 17వ తేదీన మార్కెట్లు ప్రారంభమవగానే రూ. 559 స్థాయిలో ట్రేడింగ్ మొదలు పెట్టింది. అంటే దాదాపు 20 శాతం నష్టంతో ట్రేడింగ్ మొదలు పెట్టింది. అయితే, ఇది కేవలం సాంకేతికంగా సర్దుబాటు చేసిన ధర మాత్రమే. బోనస్ ఇష్యూ ప్రకారం దీనిని మార్చారు. ఇన్వెస్టర్ల పెట్టుబడి విలువలో ఎలాంటి మార్పు ఉండదు. ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. రూ. 2 లక్షల లోపు పెట్టుబడి గల 1.5 లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఇందులో ప్రయోజనం పొందినట్లు తెలుస్తోంది. వారికి అదనపు షేర్లు లభించాయి.5 శాతం పెరిగిన స్టాక్బోనస్ ఇష్యూ తర్వాత షేరు ధర 20 శాతం తగ్గి ట్రేడింగ్ మొదలు పెట్టినా ఆ తర్వాత ఈస్టాక్ లాభాల్లోకి వెళ్లంది. ఇంట్రాడేలో రూ. 559 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టి ఒక దశలో రూ. 555 కనిష్ఠానికి పడిపోయింది. ఆ తర్వాత 7 శాతం లాభంతో రూ. 595 స్థాయిని తాకింది. ప్రస్తుతం 5 శాతానికి పైగా లాభంతో రూ. 569 వద్ద ట్రేడవుతోంది. అయితే, బోనస్ ఇష్యూ తర్వతా ఈ స్టాక్ లాభాల్లోకి వెళ్లడంతో షేర్ హోల్డర్లకు అదనపు లాభం కలుగుతుంది. ఎందుకంటే వారి ఖాతాలో అదనపు షేర్లు ఉంటాయి. ఉదాహరణకు 3 షేర్లు కలిగి ఉన్న వ్యక్తికి 4 షేర్లు వస్తాయి. అదనపు షేరు వచ్చింది. సాధారణంగా స్టాక్ ధర పెరిగితే 3 షేర్లపై వచ్చే లాభమే వచ్చేది. ఇప్పుడు అదనపు షేరు దానిపై వచ్చే లాభం అదనపు లాభంగా చెప్పవచ్చు.