
ఆరుట్ల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వాటిని తొలగించేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్) నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో రూ.15 కోట్లతో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం ప్రసంగించారు.
విద్యాశాఖపై తమ ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం వర్గానికొక స్కూల్ పెట్టి.. కుల వ్యవస్థను ప్రోత్సహించిందని ఆరోపించారు. ఆ అపోహలు తొలగించేందుకే టీపీఎస్‌లు: రేవంత్
|