
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. New Education System in Telangana: ఒకప్పుడు అందరు చదువుకునే వాళ్లు.. ఇపుడు చదువు కొంటున్నారు. ఎడ్యుకేషన్ అనేది బీద, సామాన్య, మధ్య తరగతి వాళ్లకు అందని ద్రాక్ష అయింది.
మరోవైపు ప్రభుత్వం ఉచితంగా స్కూల్స్ రన్ చేస్తోన్న చాలా మంది పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ స్కూల్స్ అంటే అప నమ్మకం. ఓ రకంగా చెప్పాలంటే ప్రైవేటు విద్యాసంస్థల్లో బోధించే టీచర్ల కంటే ప్రభుత్వ టీచర్లు ఎన్నో ఒడిదుడుకులు ప్రభుత్వం నిర్వహించే టెట్ సహా ఇతర క్లిష్టమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం రాదు.
అంతేకాదు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులకు పిల్లల పట్ల సామాజిక బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్పోరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తెలంగాణ ప్రభుత్వం .. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరిట నర్సరీ నుంచి ఇంటర్ వరకు కార్పోరేట్ స్కూల్స్‌కు ధీటుగా ఉచిత విద్య అందించేందకు రెడీ అయింది.
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా రూ. 15 కోట్లతో అత్యాధునిక వసతులతో ఆరుట్లలో తొలి స్కూల్ దీన్ని తీర్చిదిద్దారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్‌రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను ఏర్పాటు చేశారు.
విద్యార్థులతో కలిసి అల్పాహారం చేయనున్నారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. టీపీఎస్ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం నాలుగు పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు..
ఉన్నాయి. రాష్ట్రంలో దశలవారీగా 100 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఆరుట్ల టీపీఎస్ వాతావరణం ఆకట్టుకుంటోంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించనున్నారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం ఉపహారం అందించనున్నారు. ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యాబోధన జరగనుంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, ల్యాబ్స్, గాలి-వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్‌తో పాటు క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు, వసతులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షకులను కూడా అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం ఐదు స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్ వరకు మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఆరుట్లలో ఆవిష్కృతమవుతున్న నేటి ఈ ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ఆరంభం మాత్రమే అని, రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో వంద టీపీఎస్‌లను నెలకొల్పడం తదుపరి తమ కర్తవ్యమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ‘ఎక్స్’లో స్పందించారు. ఆరుట్లలో హెలిప్యాడ్ నుంచి దిగి తెలంగాణ పబ్లిక్ స్కూల్ వరకు పాఠశాలకు చెందిన బస్సులో బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్కూల్ లోని క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ల్యాబ్స్, డైనింగ్ హాల్, ప్లే గ్రౌండ్‌ను పరిశీలించారు సీఎం.
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందన్నది ఇక పై ఒక నినాదం మాత్రమే కాదు. కళ్ల ముందు కనిపించే నిజం. మేధావుల సలహాలు, విజ్ఞుల సూచనలతో తెలంగాణ విద్యా వ్యవస్థ చరిత్రను విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి రాయాలన్న నా సంకల్పానికి రూపం ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’. ఆకలి తీర్చి, అక్షరాలు నేర్పి, ఆటను ప్రోత్సహించి.. పిల్లల్లో మనోవికాసం వికసించేలా.. మట్టిలో మాణిక్యాలను తీర్చిదిద్దే సకల హంగులతో రూపుదిద్దుకున్న నా మానస పుత్రిక ఈ పాఠశాల. దీనికి రూపం ఇచ్చే కార్యంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. విద్యార్థులకు అభినందనలు’’ తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు ముఖ్యమంత్రి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి