
ఇటీవల ‘బ్లాస్ట్’ (Blast) అనే సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకొంది ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). ఈ తమిళ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. కానీ తమిళ్ లో భారీ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో ఆమె యాక్షన్ రోల్ చేసింది. ఆ సక్సెస్ తో ఆమెకి ఇప్పుడు తెలుగులో కూడా అవకాశాలు పెరిగాయి.
ప్రీతి ముకుందన్ ఇంతకుముందు తెలుగులో విష్ణు సరసన “కన్నప్ప” చిత్రంలో నటించింది. కానీ ఆ సినిమా వల్ల ఆమెకి తెలుగులో పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు శర్వానంద్ సరసన ఛాన్స్ కొట్టేసింది. శర్వానంద్ (Sharwanand), డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందనుంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నెలలో మొదలు అవుతుంది. పూర్తిగా వినోదాత్మక పంథాలో సాగే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంతకుముందు పలువురి పేర్లు అనుకున్నారు. కానీ సెట్ కాలేదు.ఫైనల్ గా ఈ భామని ఒప్పించారు అని టాక్. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించనున్నారు.
ఇటీవలే శర్వానంద్ తో ఆయన “నారి నారి నడుమ మురారి” తీసి విజయం సాధించారు
.