
ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా జరిపిన సైనిక దాడుల్లో భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సముద్ర వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచడం, నావికుల భద్రతను నిర్ధారించడం ప్రపంచ దేశాల సమష్టి బాధ్యత అని ఆయన గట్టిగా నొక్కిచెప్పారు.నిన్న జరిగిన జీ7 అవుట్‌రీచ్ సెషన్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు జరుగుతున్న ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.
"ఆ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణల వల్ల మన మిత్ర దేశాలలో తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా, హర్మూజ్ జలసంధి గుండా జరిగే సముద్ర వాణిజ్యానికి అంతరాయం కలగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఈ ఘర్షణల కారణంగా పలువురు భారతీయ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు" అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
దేశాలను వాణిజ్యపరంగా కలిపే నావికుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.ఇరాన్‌కు సంబంధించిన ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తున్నాయన్న అనుమానంతో ఇటీవల కొన్ని వాణిజ్య నౌకలపై యూఎస్ సైనిక దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
జూన్ 9న ఒమన్ గల్ఫ్‌లో పలావు జెండాతో ప్రయాణిస్తున్న 'సెట్టెబెల్లో' అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. ఆ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, వారిలో 24