
దేశంలోనే అత్యంత ఆధునికమైన, అందమైన విమానాశ్రయాల్లో ఒకటిగా పేరుగాంచిన బెంగళూరులోని 'కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2' (Terminal 2) ఇప్పుడు ఒక సరికొత్త వివాదానికి కేంద్రబిందువుగా మారింది. టెర్మినల్ లోపల ప్రయాణికులు ఇష్టారాజ్యంగా బెంచీలపై, నేలపై నిద్రిస్తున్న దృశ్యాలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడమే దీనికి కారణం.
ఈ వీడియో కాస్తా ఇప్పుడు ప్రయాణికుల పౌర బాధ్యత (Civic Sense), విమానాశ్రయంలో మౌలిక వసతుల లభ్యతపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.అఫ్రీన్ అహెమది అనే డిజిటల్ క్రియేటర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. మొదట ఈ వీడియోలో టెర్మినల్-2కు అంతర్జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పచ్చని మొక్కలు, అద్భుతమైన డిజైన్, వెదురు అలంకరణలను చూపించారు.
అయితే ఆ వెంటనే, డిపార్చర్ (Departure) ప్రాంతంలో ప్రయాణికులు అక్కడి సిమెంట్ బెంచీలపై, ఇండోర్ చెట్ల కింద, నేలపై తమ బ్యాగులను దిండ్లుగా చేసుకుని నిద్రిస్తున్న దృశ్యాలను చూపించారు. దీనికి ఆమె "మీరు ఎంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినా..
మేము మాత్రం దేశీయులముగానే ఉంటాము" (Tum jitna bhi International airport banwalo, hum toh desi hi rahenge) అనే క్యాప్షన్‌ను జోడించడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు.నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలుఈ వీడియోను విమర్శిస్తున్న వారు.. ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్న ఇలాంటి ప్రదేశాల్లో ఇలా ప్రవర్తించడం పౌర బాధ్యత లేకపోవడమేనని మండిపడుతున్నారు.
ఎయిర్పోర్ట్ అందాన్ని ఇలాంటి పనులు పాడు చేస్తున్నాయని కొందరు కామెంట్ చేశారు. అయితే, ఈ విమర్శలను తోసిపుచ్చుతూ ప్రయాణికులకు పెద్ద