
మానకొండూర్, న్యూస్టుడే: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరుతో కాంగ్రెస్ మతాల మధ్య చిచ్చు పెడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లిలో మంగళవారం ఆయన భాజపా నాయకులు, ఆర్ఎంపీలతో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతకుముందు బండి సంజయ్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ విదేశీ ముస్లిం చొరబాటుదారులను, మన దేశ ముస్లింలతో పోల్చి అవమానిస్తోందని ధ్వజమెత్తారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి పొందిన ఓట్లను తొలగించాలో.. వద్దో ఆ పార్టీ స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మన దేశ ముస్లింలకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మెట్రో రెండో దశను అడ్డుకుంటున్నారని సీఎం చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులు ఇచ్చిందన్నారు.
ప్రస్తుతం కేంద్ర నిధులు దారి మళ్లుతున్నాయని ఆరోపించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.