అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత వంద రోజులకు పైగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వెనుక ఖతార్ జరిపిన నిరంతర, రహస్య దౌత్యం కీలక పాత్ర పోషించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఈ ఒప్పందంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు, అణు చర్చల పునరుద్ధరణకు మార్గం సుగమం కానుంది.ఈ ఒప్పందంపై త్వరలోనే తటస్థ వేదికైన జెనీవాలో అధికారికంగా సంతకాలు జరగనున్నాయి. ఒప్పందం నిబంధనల ప్రకారం, ఇరు పక్షాలు తక్షణమే కాల్పుల విరమణను పాటించాల్సి ఉంటుంది.
దీనితో పాటు, ప్రపంచ ఇంధన సరఫరాకు అంతరాయం కలిగించిన హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించనున్నారు. కొన్ని ధ్రువీకరించదగిన చర్యలకు ప్రతిఫలంగా ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను దశలవారీగా సడలించేందుకు కూడా అంగీకారం కుదిరింది.2026 ప్రారంభం నుంచి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చోటుచేసుకున్న సైనిక చర్యలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి.
చర్చల ప్రారంభ దశలో పాకిస్థాన్ చొరవ తీసుకుని ఇరు దేశాల మధ్య సంప్రదింపులకు వేదిక కల్పించింది. అయితే, అణు పరిమితులు, యురేనియం నిల్వలు వంటి క్లిష్టమైన సాంకేతిక అంశాలపై ఏకాభిప్రాయం సాధించడంలో ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించలేదు.ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఖతార్ రంగంలోకి దిగింది.
అమెరికా, ఇరాన్ దేశాలతో సత్సంబంధాలు కలిగిన ఖతార్ రాయబారులు, ఇరు దేశాల మధ్య రహస్య మంతనాలు జరిపి, ఒప్పందంలోని సంక్లిష్టాంశాలపై ఏకాభిప్రాయం సాధించడంలో సఫలమయ్యారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, నావికాదళ