
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Redmi Turbo 5 India Launch News: భారతదేశ మొబైల్ మార్కెట్లోకి రెడ్మి (Redmi) సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. దీనిని కంపెనీ రెడ్మి టర్బో 5 (Redmi Turbo 5) స్మార్ట్‌ఫోన్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది.
ఇది చైనాలో విడుదలైన కొద్ది రోజులకే భారత మార్కెట్లోకి అందుబాటులోకి రావడం విశేషం.. అయితే, దీనిని కంపెనీ రూ.34 వేల నుంచి రూ.38 వేల బడ్జెట్ విభాగంలో ఐఫోన్ రేంజ్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకునేందుకు ఇది సిద్ధమైంది.
అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ధర వివరాలు.. భారతదేశంలో రెడ్మి టర్బో 5 బేస్ వేరియంట్ (8GB RAM + 256GB స్టోరేజ్) ధర రూ. 37,999 నుంచి ప్రారంభమవుతుంది.. ఈ స్మార్ట్‌ఫోన్ అస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూతో పాటు టర్బో వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది..
కస్టమర్లు ఈ మొబైల్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ (Amazon India)తో పాటు Mi.com, అధికారిక స్టోర్ల ద్వారా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.. అంతేకాకుండా మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
కళ్లు చెదిరే డిస్ప్లే.. ఈ రెడ్మి టర్బో 5 ఫోన్లో 6.59-ఇంచుల 1.5K అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో పాటు 3,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది.. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా
స్పష్టంగా, ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇచ్చారు. అంతేకాకుండా, ధూళి మరియు నీటి నుండి రక్షణ కోసం అత్యుత్తమమైన IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్స్‌ను కలిగి ఉండటం విశేషం.
సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్.. గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఇందులో శక్తివంతమైన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా (MediaTek Dimensity 8500 Ultra) చిప్‌సెట్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. ఇది గరిష్టంగా 3.4GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ఓఎస్ 3 (HyperOS 3)పై ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో అడ్వాన్స్డ్ AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది..
7,540mAh మెగా బ్యాటరీ.. రెడ్మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ.. ఇందులో కంపెనీ ఏకంగా శక్తివంతమైన 7,540mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు వచ్చింది.. దీనికి తోడు 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్ కూడా లభిస్తోంది. ఇది ఫోన్‌ను చాలా త్వరగా చార్జ్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది.. అలాగే 27W రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. దీని ద్వారా ఇతర డివైజ్‌లను కూడా ఎంతో సులభంగా చార్జ్ చేసుకుని సదుపాయం లభిస్తుంది.
50MP అల్ట్రా కెమెరా.. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్‌తో కూడిన మోస్ట్ పవర్ఫుల్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రధాన కెమెరాతో పాటు అదనంగా శక్తివంతమైన 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. ఇక ఫ్రంట్ భాగంలో సెల్ఫీల కోసం 20-మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.