ముందుగా ఓ పాత్రలో నీళ్లు పోసి కడిగిన వేపాకులు వేయండి. ఈ నీటిని బాగా మరిగించి వడపోయండి. ఈ నీళ్లను మీరు స్నానం చేసే నీళ్లతో కలపండి. రోజూ ఇలా చేస్తే చర్మానికి ఎంతో మంచిది. చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, ఇన్ఫెక్షన్లను నివారించడంలో వేపాకులు సహాయపడతాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం పేర్కొంది.
రోజూ ఈ వేపాకులు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మం ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో స్కిన్ సమస్యలు రాకుండా ఉంటాయి. వేపాకుల్లోని యాంటీ ఫంగల్ గుణాలు చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా వర్షాకాలం, తేమ వాతావరణంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి.
దీనికోసం మీరు స్నానం చేసే నీటిలో వేపాకులు వేసుకుంటే మంచిది. వేపాకుల్లోని యాంటీ మైక్రోబియల్ గుణాలు కుదుళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో పాటు చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే చుండ్రు ఉన్నవారు వేపాకుల నీటితో జుట్టు కడగడం మంచిది.
చర్మంపై యాక్నె, మొటిమలు వంటి సమస్యలు తగ్గించడంలో వేపాకులు సహాయపడతాయి. చర్మంపై మొటిమల ఏర్పడిన మరకలు తొలగించడంలోనూ వేపాకుల స్నానం దోహదపడుతుంది. వేపాకుల్లోని పోషకాలు శరీరం దుర్వాసన రాకుండా కాపాడుతాయి. చర్మం వాసన ఎక్కువగా వచ్చేవారు ఈ వేపాకుల నీటితో స్నానం చేయడం మంచిది.
వేడి వల్ల చర్మంపై ఏర్పడిన కురుపులు, ర్యాషెస్ వంటి సమస్యలు తగ్గడానికి వేపాకుల స్నానం చేయడం మంచిది. ఇది చర్మాన్ని కూల్ చేసి వేడి కురుపులు తగ్గిస్తుంది. చర్మంపై ఏర్పడిన చిన్నపాటు గాయాలు, వాటి మచ్చలు నయం చేయడంలో వేపాకులు సహాయపడతాయి.
ఈ గాయాలు అయినపుడు వేపాకుల నీటితో స్నానం చేస్తే మంచిది. తామర, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలు నివారించడంలోనూ వేపాకులు సహాయపడతాయి. వేపాకులు కలిపిన నీటితో స్నానం చేస్తే తామర, సొరియాసిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి
.