
వర్షాకాలం అంటే ఇంటికే పరిమితం కావాల్సిన సమయమని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రకృతి అందాలను ఆస్వాదించే వారికి మాత్రం ఇదే సరైన సీజన్. ఎండలతో కళతప్పిన కొండలు, అరణ్యాలు, లోయలు వర్షాకాలం రాకతో కళకళలాడుతాయి. జలపాతాలు ఉరకలెత్తుతాయి.
కొండలను తాకుతూ మేఘాలు అద్భుత దృశ్యాలను ఆవిష్కరిస్తాయి. దేశంలో కొన్ని ప్రదేశాలు వర్షాకాలంలో కొత్త రూపును సంతరించుకొని అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి. అవేంటో చూద్దాం..మున్నార్ (కేరళ): వర్షాకాలంలో మున్నార్ అందాలు రెట్టింపవుతాయి.
ఎటుచూసినా విస్తరించి ఉన్న టీ తోటలు పచ్చని తివాచీ పరచినట్లు కనిపిస్తాయి. కొండల మధ్య తేలియాడే మేఘాలు, పొగమంచు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ప్రశాంతత కోరుకునే వారికి ఇది అద్భుతమైన గమ్యస్థానం.కూర్గ్ (కర్ణాటక): ‘ఇండియా స్కాట్లాండ్’గా పేరొందిన కూర్గ్ వర్షాలతో మరింత సుందరంగా మారుతుంది.
కాఫీ తోటలు, దట్టమైన అడవులు, ప్రవహించే నదులు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. వర్షాల సమయంలో ఇక్కడి జలపాతాలు మరింత ఉప్పొంగి ప్రకృతి వైభవాన్ని చాటుతాయి.లోనావాలా-ఖండాలా (మహారాష్ట్ర): ముంబై, పుణే నగరాలకు సమీపంలో ఉన్న ఈ జంట హిల్ స్టేషన్లు మాన్సూన్ టూరిజానికి ప్రసిద్ధి.
వర్షాల వేళ కొండలపై నుంచి జాలువారే వందలాది చిన్న జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మేఘాలను కప్పుకున్నట్టుండే లోయలు, కొండల మధ్య ప్రయాణం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ (ఉత్తరాఖండ్): వర్షాకాలంలోనే ఈ ప్రాంతం అసలు అందాలను సంతరించుకుంటుంది.
వేలాది రకాల పూలు వికసించి రంగురంగుల ప్రకృతి చిత్రంలా మారుతుంది. ట్రెక్కింగ్ ప్రియులకు, ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామంగా నిలుస్తుంది.చిరపుంజీ (మేఘాలయ): ప్రపంచంలో