
రెడ్మి టర్బో 5 మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ ఈ ఫోన్ 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 50MP OIS కెమెరా, IP69K వరకు రేటింగ్ Redmi Turbo 5 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి రెడ్మి నుంచి టర్బో సిరీస్‌లో ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.
ఈ రెడ్మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్‌ను ఫస్ట్ చైనాలో లాంచ్ చేయగా, ఇప్పుడు భారత మార్కెట్లోకి కూడా వచ్చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్, భారీ 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K డిస్ప్లే (Redmi Turbo 5) ఉన్నాయి.
ఈ ఫోన్లో IP66, IP68, IP69, IP69K రేటింగ్ ఉండగా, డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. ధర ఎంతంటే? : భారత మార్కెట్లో రెడ్మి టర్బో 5 ఫోన్ ఆస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూ టర్బో వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 19వ తేదీ నుంచి అమెజాన్, (Mi.com) ఇతర ఆఫ్‌లైన్, ఆన్లైన్ రిటైల్ ఛానెళ్ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
ధరల విషయానికి వస్తే.. రెడ్మి టర్బో 5 ఫోన్ 8GB+256GB వేరియంట్ ధర సుమారుగా రూ. 37,999గా ఉంది. 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా రూ. 40,999గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ. 20వేల వరకు అదనపు డిస్కౌంట్ సహా లాంచ్ ఆఫర్ల వివరాలను కంపెనీ షేర్ చేసింది.
Read Also - Samsung Galaxy Z Flip 5 5G : ఖతర్నాక్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫ్లిప్ ఫోన్‌పై ఏకంగా రూ. 41,799 తగ్గింపు.. డోంట్ మిస్! రెడ్మి టర్బో 5 స్పెసిఫికేషన్లు : రెడ్మి టర్బో 5లో 2712×1220 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల 1.5K ఫ్లూయిడ్ డిస్ప్లే ఉంది.
ఈ డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10+, డాల్బీ విజన్ 3500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్క్రీన్కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఫోన్లో 7540mAh బ్యాటరీ ఉంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌తో పాటు 12GB వరకు LPDDR5X అల్ట్రా ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్కు కూడా సపోర్ట్ చేస్తుంది. తద్వారా ర్యామ్ 12GB వరకు విస్తరించుకోవచ్చు. థర్మల్ మేనేజ్మెంట్ కోసం ఇందులో 3D ఐస్-లూప్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. రెడ్మి టర్బో 5 బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OIS, EIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. కనెక్టివిటీ ఫీచర్లలో 5జీ, Wi-Fi, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సి ఇతర స్టాండర్డ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ఓఎస్ 3పై రన్ అవుతుంది. ప్రీమియం బిల్డ్ కోసం ఏరోస్పేస్-గ్రేడ్ మెటల్ ఫ్రేమ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 8.18mm మందంతో ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది.