
రైల్వే ట్రాక్‌లపై విద్యుత్ రైళ్లు నడవడానికి పైభాగంలో ప్రత్యేకమైన విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తారు. వీటిని ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ (OHE) అని పిలుస్తారు. రైలు పైభాగంలో ఉండే పాంటోగ్రాఫ్ ఈ తీగను తాకి విద్యుత్‌ను స్వీకరిస్తుంది.
ఈ తీగలు ఎప్పుడూ సరైన టెన్షన్లో ఉండాలి. ఇందుకోసం స్థంభాల పక్కన భారీ బరువులను వేలాడదీస్తారు. వీటినే కౌంటర్ వెయిట్స్ అంటారు. సాధారణంగా ఇవి కాంక్రీట్ లేదా లోహంతో తయారు చేసిన బరువైన సిలిండర్లుగా ఉంటాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా తీగలు సాగడం, కుదించుకోవడం సహజం.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల తీగలు పొడవవుతాయి. చలికాలంలో మళ్లీ కుదుస్తాయి. ఈ మార్పుల వల్ల తీగలు వదులుగా మారకుండా లేదా అతిగా బిగుసుకోకుండా కౌంటర్ వెయిట్స్ నిరంతరం సమతుల్య టెన్షన్‌ను కల్పిస్తాయి. దీంతో విద్యుత్ తీగ ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటుంది.
ఈ బరువులు లేకపోతే విద్యుత్ తీగల్లో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తీగలు వదులుగా మారవచ్చు, దీంతో పాంటోగ్రాఫ్కు సరైన స్పర్శ ఉండకపోవచ్చు. ఈ కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్పార్కింగ్ జరిగే ప్రమాదం పెరుగుతుంది, రైళ్ల వేగం తగ్గించాల్సి రావచ్చు, కొన్ని సందర్భాల్లో అయితే విద్యుత్ తీగలు తెగిపోయే ప్రమాదం కూడా ఉంది.
ఇలాంటి సమస్యలు రైల్వే సేవలపై ప్రభావం చూపడంతో పాటు భద్రతా ప్రమాదాలకు కూడా దారి తీసే అవకాశం ఉంది. నేటి ఆధునిక రైళ్లు గంటకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. కొన్ని ప్రత్యేక రైళ్లు ఇంకా ఎక్కువ వేగంతో నడుస్తున్నాయి.
అధిక వేగంతో వెళ్తున్న రైలుకు పైభాగంలోని పాంటోగ్రాఫ్ విద్యుత్ తీగను నిరంతరం తాకుతూ ఉండాలి. తీగలో టెన్షన్ సరిగ్గా లేకపోతే పాంటోగ్రాఫ్ ఎగిరిపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలు వస్తాయి. కౌంటర్ వెయిట్స్ ఈ సమస్యలను నివారించి వేగవంతమైన ప్రయాణానికి సహకరిస్తాయి.
పక్కన వేలాడుతున్న ఈ బరువులను చాలామంది సాధారణ వస్తువులుగా భావిస్తారు. కానీ రైల్వే విద్యుత్ వ్యవస్థలో ఇవి అత్యంత కీలకమైన భాగం. లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే వ్యవస్థలో కౌంటర్ వెయిట్స్ నిశ్శబ్దంగా తమ పని చేస్తుంటాయి. రైల్వే ట్రాక్‌ల పక్కన కనిపించే ఈ సిల్వర్ సిలిండర్లు లేకపోతే విద్యుత్ రైళ్ల నిర్వహణ అంత సులభం కాదు. అందుకే చిన్నగా కనిపించినా, రైల్వే వ్యవస్థలో వీటి ప్రాధాన్యం చాలా పెద్దది.
ట్రాక్