
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై డిప్యూటీ సీఎం చర్చించారు. ఢిల్లీ, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఈరోజు(మంగళవారం) ఢిల్లీలో సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై డిప్యూటీ సీఎం చర్చించారు. నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి అవసరమని సీఆర్ పాటిల్ సూచించారు. జల్ జీవన్ మిషన్ అమల్లో కృషి చేస్తున్న కేంద్ర అధికారులకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.
ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీటి కొరత కొనసాగుతోందని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ప్రజలకు స్థిరమైన తాగునీటి సరఫరా కోసం మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని తెలిపారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ జలాల స్వచ్ఛత, నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని సూచించారు.
సూరత్‌లో శుద్ధి చేసిన పారిశ్రామిక నీటి పునర్వియోగ విధానాన్ని అధ్యయనం చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. సూరత్ నమూనాను ఏపీలో అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఏపీలో గత పదేళ్లుగా చర్యలు కొనసాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సమస్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పారిశ్రామిక కాలుష్యం కారణంగా నదులు, జల వనరులు ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ (ZLD) చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షలకు అనుగుణంగా నీటిని తాగునీటి ప్రమాణాలకు తీసుకురావాలని నిర్దేశించారు.
నీటి పునర్వినియోగం, కాలుష్య నియంత్రణ, నదుల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అవసరమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం సమావేశం..
Read Latest AP News And Telangana News And National News
5 తీర్మానాలకు ఆమోదం