
Redmi Turbo 5 | ఇంటర్నెట్ డెస్క్: షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్మీ కొత్తగా టర్బో సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో టర్బో 5 పేరిట తొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ప్రీమియం మిడ్ రేంజ్ సెగ్మెంట్లో దీన్ని తీసుకొచ్చింది.
పెర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ బిగ్ బ్యాటరీతో ఈ ఫోన్‌ను లాంచ్ చేయడం విశేషం. ఆల్‌రౌండ్ ఫీచర్లు కోరుకునేవారిని లక్ష్యంగా చేసుకొని టర్బో 5ని లాంచ్ చేసింది. 4+6 అప్డేట్ పాలసీ ఇస్తున్నారు.
రెడ్మీ టర్బో 5 ఆండ్రాయిడ్ 16తో కూడిన హైపర్ఓఎస్3తో పనిచేస్తుంది. ఇందులో 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. 120 Hz రిఫ్రెష్ రేటు, 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇచ్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది.
ఐపీ66, ఐపీ68, ఐపీ69+ ఐపీ69k రేటింగ్ కలిగిన వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రాచిప్సెట్ ఇచ్చారు. LPDDR5X Ultra ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ సదుపాయం ఉంది. ఆంటుటు బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌పై 23 లక్షల పాయింట్లు స్కోర్ చేసిందని కంపెనీ తెలిపింది.
వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సదుపాయం కలిగిన సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సర్‌తో కూడిన 50 ఎంపీ ప్రధాన కెమెరా ఇచ్చారు. 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీల కోసం 20 ఎంపీ కెమెరా ఉంది.
రెడ్మీ పిక్సెల్ మ్యాట్రిక్స్ అనే కొత్త ఫీచర్‌ను ఇందులో పరిచయం చేశారు. నోటిఫికేషన్లు, అలర్టులు వచ్చినప్పుడు కెమెరా లెన్స్ చుట్టూ సర్కిల్ ఆకారంలో లైట్ వెలుగుతుంది. 7,540 ఎంఏహెచ్ బ్యాటరీ, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
టర్బో 5 రెండు వేరియంట్లో లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.37,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.40,999గా పేర్కొంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొనుగోళ్లపై రూ.2 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. జూన్ 19 నుంచి అమెజాన్‌లో విక్రయానికి రానుంది. ఆస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూ, టర్బో వైట్ రంగుల్లో లభిస్తుంది. మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ వల్ల ఫోన్ చూడ్డానికి ప్రీమియం ఫీల్ ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
27W రివర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, బ్లూటూత్ 6.0, ఐఆర్ బ్లాస్టర్ సదుపాయం ఉన్నాయి. ఇక ధర విషయానికొస్తే.. రెడ్మీ