
అమరావతి: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. హాల్ టికెట్ చూపించిన నీట్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు.
పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునేలా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి తెలిపారు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులపై ప్రయాణ భారం తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట అదనపు సర్వీసులు నడపాలని అధికారులను రాంప్రసాద్‌రెడ్డి ఆదేశించారు. నీట్ పరీక్ష రాసే ప్రతి విద్యార్థి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
జూన్ 21న దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు..
సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్‌కుమార్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను బహూకరించారు. ఏపీలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గిందని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయ స్వరూపం త్వరలోనే పూర్తిగా మారనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది
.