
స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ రేర్ ఫీట్ ను సాధించబోతున్నారు. ఈ తరంలో సీనియర్ స్టార్ హీరోలు నలుగురితో సినిమాలు చేసిన ఖ్యాతి అనిల్ రావిపూడికి దక్కబోతోంది. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో సీనియర్ స్టార్ హీరోలంటే... నలుగురే నలుగురు.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్. ఈ నలుగురితో ముందు తరంలో కొంతమంది ప్రముఖ దర్శకులు సినిమాలు చేశారు. మంచి విజయాలను తమ ఖాతాల్లో వేసుకున్నారు. అయితే అలాంటి రేర్ ఆపర్చునిటీ ఈ తరం దర్శకులలో ఎవరికీ దక్కలేదు. ఇప్పుడు ఆ రేర్ ఫీట్‌కు ఒక అడుగు దూరంలో ఉన్నాడు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి.
ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌లతో సినిమాలు తీసి హిట్ కొట్టాడు అనిల్. ఇక మిగిలిన అక్కినేని నాగార్జునతోనూ ఓ సినిమా చేయబోతున్నట్టు అనిల్ ప్రకటించడం విశేషం. ఇటీవల ఓ ఛానెల్లో జరిగిన కార్యక్రమంలో అనిల్ రావిపూడి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
అలనాటి అందాల నాయిక రాధతో అనిల్ మాట్లాడుతూ, త్వరలోనే నాగార్జునతో సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. దాంతో కింగ్ నాగ్ అభిమానులు తెగ ఆనంద పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే వెంకటేశ్‌తో నాలుగు సినిమాలు చేసిన అనిల్... ఇప్పుడు ఐదో సినిమాను వెంకీ, కళ్యాణ్ రామ్ కాంబోలో చేస్తున్నారు.
అలానే బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' మూవీ చేసి, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక చిరంజీవితో చేసిన 'మన శంకర వరప్రసాద్ గారు' సౌతిండియన్ రికార్డ్‌ను సృష్టించింది. సో... త్వరలోనే నాగార్జునతోనూ మూవీ చేస్తే... అది కూడా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని నాగ్ అభిమానులు భావిస్తున్నారు.
ఎందుకంటే... నాగార్జునలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఈ మధ్య కాలంలో దానిని ఉపయోగించుకున్న వాళ్ళు లేరు. దాంతో వీరి కాంబో నుంచి గతంలో వచ్చిన 'హలో బ్రదర్', 'ఘరానా బుల్లోడు', 'ఆవిడ మా ఆవిడే' తరహా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీని ఫ్యాన్స్ ఎక్స్
పెక్ట్ చేస్తున్నారు.
ఇండస్ట్రీని షేక్ చేసిన చికిరి చికిరి వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్
Bollywood: అప్పుడు సుశాంత్... ఇప్పుడు సంచిత!